అభివృద్ధి పనులు పూర్తి చేయండి
తిరుపతి అర్బన్ : స్వర్ణనారావారి పల్లె అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం, అనిమల్ హాస్టల్, సబ్‌స్టేషన్, రంగంపేట స్కూల్ నిర్మాణం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తదితర పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దివ్యాంగ పిల్లలకు పోటీలు
తిరుపతి అర్బన్ : అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నేపథ్యంలో శుక్రవారం తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో తిరుపతి, చిత్తూరుకు చెందిన విభిన్న ప్రతిభావంతులైన పిల్లలకు పోటీలు నిర్వహించారు. శనివారంతో ఈ పోటీలు ముగించనున్నారు. ప్రధానంగా ట్రైసైకిల్ రేస్‌లు, వీల్‌చైర్ రేసులు, రన్నింగ్, లాంగ్‌జంప్, షాట్‌ఫుట్, కబడ్డీ, త్రో బాల్ పోటీలు చేపట్టారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ాన్నివా పురస్కరించుకుని విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొని విజేతలైన చిత్తూరు జిల్లా పిల్లలకు డిసెంబర్ 3న చిత్తూరులోని పూలే భవనంలో జరిగే కార్యక్రమంలో ప్రశంసా పత్రాలను అందజేయనున్నారు. అలాగే తిరుపతిలోని కలెక్టరేట్‌లో డిసెంబర్ 6న జరిగే కార్యక్రమంలో పిల్లలకు ప్రశంసా పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ సంచాలకులు యుగంధర్, తిరుపతి, చిత్తూరు జిల్లాల విభిన్న ప్రతిభావంతుల జిల్లా అధికారి విక్రమ్‌కుమార్‌రెడ్డి, సర్వే విభాగం తిరుపతి జిల్లా అధికారి అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పూర్తి చేయండి


