బెల్టు షాపులు నిర్వహించే గ్రామాలు
క్వార్టర్ బాటిల్‌కు అదనంగా
రూ. 50 వసూలు
24 గంటలు అందుబాటులో మద్యం
ఏడు నెలల్లో అంతా తలకిందులు
ఒక్కో గ్రామంలో 3 నుంచి 5 బెల్టుషాపులు
అధికార పార్టీ నేతల కనుసన్నల్లో వ్యాపారం
మద్యం దుకాణాల నుంచి బెల్టు షాపులకు సరఫరా
మామూళ్ల మత్తులో ఎకై ్సజ్ అధికారులు
ఒక్కో దుకాణం నుంచి రూ.25 నుంచి రూ.30 వేలు నెల మామూళ్లు?
వరదయ్యపాళెం : మద్యం బెల్టు షాపుల విషయంలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయి. మద్యం దుకాణాలు టెండర్ల ద్వారా చేజిక్కించుకున్న వారి కనుసన్నల్లో గ్రామస్థాయిలో బెల్టు దుకాణాలు రోజురోజుకు పుట్టుకొస్తున్నాయి. గ్రామాల్లో ఉన్న చిల్లర కొట్టు దుకాణాల్లో నిత్యావసర సరుకులతో పాటు మద్యం విక్రయం కూడా ఈ ప్రభుత్వంలో షరా మామూలైంది. నియంత్రించాల్సిన ఎకై ్సజ్ శాఖ, పోలీసులు టీడీపీ నేతల సేవలో చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సత్యవేడు నియోజకవర్గంలో బెల్టు దుకాణాలు విచ్చలవిడిగా ఏర్పాటవుతున్నాయి. ఆ దిశగా నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో 34 మద్యం దుకాణాలు అధికారికంగా ఉన్నాయి. అనధికారిక బెల్టు మద్యం దుకాణాలు మాత్రం 150 పైగా ఉన్నట్లు సమాచారం. దీంతో మద్యం బాబులకు కిక్కు కాస్త ఎక్కువై పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేగుతోంది. దీంతో మద్యానికి బానిసైన వారు పనులకు సైతం మాని మద్యం మత్తుకే పరిమితమవుతున్నారు. గ్రామస్థాయిలో తెల్లవారే సరికి మద్యం అందుబాటులో ఉండడంతో పూర్తిగా మద్యానికి బానిసవుతున్నట్లు వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.
మత్తులో ఎకై ్సజ్‌శాఖ అధికారులు
గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు పుట్టుకొస్తున్నా నియంత్రించాల్సిన ఎకై ్సజ్‌శాఖ పోలీసులు మామూళ్ల మత్తులో తూలుతున్నారు. ఒక్కో లైసెన్స్ మద్యం దుకాణం నుంచి రూ. 25 నుంచి రూ. 30 వేలు మామూళ్లు ఎకై ్సజ్ శాఖ పోలీసులు అందుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 34 మద్యం దుకాణాల నుంచి రూ. 10 లక్షలు దాకా మామూళ్లు ఆ శాఖకు చెందిన కిందిస్థాయి అధికారుల నుంచి పైస్థాయి అధికారుల వరకు చేరుతున్నాయనే విమర్శలు లేకపోలేదు.దీని కారణంగా మద్యం బెల్టు దుకాణాలు నియోజకవర్గంలో విచ్చలవిడిగా మారాయి. నియోజకవర్గంలోని 7 మండలాల్లో 150కి పైగా బెల్టు దుకాణాలు జరుగుతున్నట్లు సమాచారం. పిచ్చాటూరు, నాగలాపురం, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాలు నాగలాపురం ఎకై ్సజ్ పరిధిలోకి రాగా బీఎన్‌కండ్రిగ, కేవీబీపురం శ్రీకాళహస్తి, నారాయణవనం మండలం పుత్తూరు ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోకి వస్తాయి. 7 మండలాల్లో పెద్ద ఎత్తున బెల్టుషాపులు పుట్టుకొస్తున్నప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇదంతా కూటమి ప్రభుత్వ కనుసన్నల్లో బెల్టు దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు సమాచారం.
బెల్టు దోపిడీ
అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు
వరదయ్యపాళెం మండలంలో దాదాపు 40కిపైగా మద్యం బెల్టు దుకాణాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు స్థానిక ప్రజలు, మహిళలు వాపోతున్నారు. ఈ విషయాన్ని అధికారులకు, పోలీసులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదు. కారిపాకం గ్రామం నుంచి 10 మంది మహిళలు వరదయ్యపాళెం పోలీస్ స్టేషన్‌లో బెల్టుషాపుల నియంత్రణ గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ గ్రామం మహిళలు వాపోతున్నారు. పోలీసులు దృష్టి సారిస్తే బెల్టుషాపులు మూత పడతాయి. –చిన్నిరాజ్, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి
బెల్టు దుకాణాలు అరికట్టాలి
నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం బెల్టు దుకాణాలు పుట్టుకొస్తున్నాయి. ఎకై ్సజ్ అధికారు లు దృష్టి సారించడంలో పూర్తిగా విఫలమయ్యా రు. అత్యధిక ధరలకు బెల్టు దుకాణాల ద్వారా మద్యం విక్రయిస్తుండడంతో కాయ కష్టం చేసుకునే వారి జేబులకు చిల్లుపడుతోంది. –దాసరి జనార్దన్, సత్యవేడు నియోజకవర్గ సీపీఎం నాయకుడు
సత్యవేడు నియోజకవర్గంలోని 7 మండలాల్లో 150కు పైగా బెల్టు దుకాణాలు నిర్వహణ జరుగుతున్నట్లు సమాచారం. ఆ మేరకు మండలాల వారీగా వివరాలు ఇలా..
వరదయ్యపాళెం మండలం : వరదయ్యపాళెం మండలంలోని సంతవేలూరు, కువ్వాకొల్లి, సీఎల్‌ఎన్‌పల్లి, మరదవాడ, వరదయ్యపాళెం, కడూరు, నెల్లటూరు, కంచరపాళెం, చిన్న పాండూరు, వీకేఆర్‌వైకాలనీ, మోపూరుపల్లి, బత్తలవల్లం, కారిపాకం, పులివల్లం, చిలమత్తూరు, రాచకండ్రిగ, పెద్ద పాండూరు, నాగనందాపురం, చెన్నవారిపాళెం గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు.
బీఎన్‌కండ్రిగ మండలం : కంచనపుత్తూరు, నీర్పాకోట, గోవిందప్పనాయుడుకండ్రిగ, ఆర్ ఆనంతాపురం, పుత్తేరి, రెడ్డిగుంట బాడవ, గాజుల పెళ్లూరు, కాంపాళెం, కుక్కంబాకం, బీఎన్‌కండ్రిగ. సత్యవేడు మండలంలో ఇరుగుళం, మాదనపాళెం, వెంకటాపురం, రామచంద్రాపురం, అప్పయ్యపాళెం, కొల్లేరుపాళెం, సిద్ధమగ్రహారం, పీవీపురం, మదనంబేడు, కాదిరివేడు, బాలకష్ణాపురం, సత్యవేడు మండల కేంద్రంలో 6 చోట్ల నిర్వహిస్తున్నారు.
కేవీబీపురం మండలం : పాటపాళెం, అంజూరు, అంజూరుపాళెం, కొండల్లో ఆదరం, పవనవారికండ్రిగ, బైరాజుకండ్రిగ, పెరిందేశం, ఓళ్లూరులో మూడుచోట్ల, కేవీబీపురంలో మూడు చోట్ల నిర్వహిస్తున్నారు.
పిచ్చాటూరు మండలం : చెంచురామశెట్టికండ్రిగ, కారూరు, పులిగుండ్రం, మాలగుంట, అడవికొడియంబేడు, రామగిరి, గొల్లకండ్రిగ, నీరువాయి, సిద్ధురాజుకండ్రిగలలో నిర్వహిస్తున్నారు.
నాగలాపురం మండలం..: టీపీకోట, నందనం, నాగలాపురం బీసీకాలనీ, బీరకుప్పం, నాగలాపురంలో మూడు చోట్ల నిర్వహిస్తున్నారు.
నారాయణవనం మండలం : కై లాసకోన క్రాస్, పాలమంగళం, అరణ్యకండ్రిగ గ్రామాల్లో నిర్వహిస్తున్నారు.


