చెవిరెడ్డి జయమ్మకు కన్నీటి వీడ్కోలు
ఏర్పేడు : శ్రీకాళహస్తి వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాతృమూర్తి చెవిరెడ్డి జయమ్మను గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. శుక్రవారం శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగ గ్రామంలో ఆమె భౌతిక కాయానికి తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలలో పాల్గొని శ్మశానం వరకు ఆమె పాడె మోశారు. మృతురాలి కుమారుడు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్‌రెడ్డిని ఓదార్చి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాగా దాడిలో గాయపడిన మృతురాలి భర్త మహదేవరెడ్డి చికిత్స పొందుతూ శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, బర్రె సుదర్శన్ రెడ్డి, చంద్ర రెడ్డి, రవీందర్ రెడ్డి, చంద్ర రెడ్డి, శేఖర్‌రెడ్డి, గంగిరెడ్డి, ఈశ్వర్ రెడ్డి, శివరెడ్డి, సుబ్బా రెడ్డి,నాగరాజు రెడ్డి, చెంచయ్య నాయుడు, సుమన్ రెడ్డి, శ్రీవారి సురేష్, మున్నా రాయల్, బుల్లెట్ జయశ్యామ్ రాయల్, యశ్వంత్ రెడ్డి పాల్గొన్నారు.


