అమ్మా.. పిలిచావా కన్నా!
బిడ్డల దత్తతకు పాకులాడుతున్న తల్లులు
పదేళ్లు దాటినా పిల్లలు లేనివారు
30 వేలకు పైనే
సంతానలేమి అర్బన్ ప్రాంతాల్లోనే అధికం
దత్తత మాసోత్సవాల్లో తల్లిదండ్రులకు అవగాహన
చట్టపరంగానే దత్తత తీసుకోవాలంటున్న అధికారులు
●
తిరుపతి అర్బన్ : తల్లికి మాతృత్వం భగవంతుడు కల్పించిన ఓ వరంగా తల్లిదండ్రులు భావిస్తుంటారు. అయితే కొందరికి వివాహం చేసుకుని పదేళ్లు గడిచినా సంతాన సాఫల్యానికి నోచుకుని కుటుంబాలు జిల్లాలో 30 వేల కుటుంబాలకు పైగానే ఉన్నట్లు అధికారుల వద్ద లెక్కలున్నాయి. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లోనే వీరి సంఖ్య 20 వేలు ఉన్నటు్‌ల్ అధికారులు లెక్కలు చూపుతున్నారు. ఈ క్రమంలో జాతీయ దత్తత మాసోత్సవాల్లో భాగంగా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఊరువాడ అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలను దత్తత తీసుకోవడానికి ఎన్నో కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. చంటిబిడ్డలను దత్తత తీసుకోవడం ఓ అమృతంగా భావిస్తున్న అనేక కుటుంబాలకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారు. శిశు గృహ కేంద్రాల నుంచి దత్తత ఎలా పొందాలో తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. అర్హతలున్న వారికి చిన్నారులను దత్తత ఇవ్వడానికి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ముందుకు వస్తున్నారు.
దత్తతకు దరఖాస్తులు ఇలా....
చంటి బిడ్డలను దత్తత తీసుకునే తల్లిదండ్రులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కారా.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌లో అప్లికేషన్ పూర్తి చేసి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం దంపతుల ఫ్యామిలీ ఫొటోగ్రాఫ్, పాన్‌కార్డు, జనన ధ్రువపత్రం, ఆధార్ లేదా ఓటర్ కార్డు లేదా పాస్‌పోర్ట్, సంవత్సర ఆదాయ ధృవీకరణ పత్రం, సాలరీ సర్టిఫికెట్, ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్, ఇతర ప్రాపర్టీ డాక్యుమెంట్స్, దీర్ఘకాలిక అంటువ్యాధులు లేదా ప్రాణంతకర వ్యాధితో బాధపడడం లేదనే ధృవీకరిస్తూ వైద్యుల నుంచి మెడికల్ సర్టిఫికెట్‌ను అందించాల్సి ఉంటుంది.
అనధికారిక దత్తత చెల్లదు
కొందరు అనధికారికంగా పిల్లలను దత్తత తీసుకుంటూ ఉంటారు. తమ బంధువుల పిల్లలు, స్నేహితుల పిల్లలు, లేదా ఎవరైనా తెలిసిన వారి పిల్లలను తీసుకుంటుంటారు. అయితే అలాంటివి జేజే యాక్టు సెక్షన్ 81 ప్రకారం చెల్లవని చెబుతున్నారు. అంతేకాదు ఐదేళ్ల జైలు శిక్షతోపాటు వారికి జరిమాన విధించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
దత్తత తల్లికి ఓ వరం
దత్తతకు అర్హులు ఎవరు?
వివాహం అయిన తర్వాత కనీసం రెండేళ్లపాటు ఎలాంటి గొడవలు లేకుండా ఉన్న దంపతులు. వివాహం అయిన రెండేళ్లలోపు దత్తత తీసుకోవాలంటే మగవారి వయస్సు 45 ఏళ్లు , ఆడవారి వయస్సు 40 ఏళ్లకు మించరాదు. ఒంటరి మహిళ అయితే 40 ఏళ్లు మించరాదు. మగ, ఆడ బిడ్డలకు దత్తతకు దరఖాస్తులు చేయవచ్చు.ఒంటరి పురుషుడు అయితే మగబిడ్డను మాత్రమే దత్తతకు దరఖాస్తు చేయాలి. దత్తత తీసుకునే దంపతులు ఆరోగ్యంగా, ఆర్థికంగా, మానసికంగా ధృడ సంకల్పంతో ఉండాలి. భార్య,భర్తలు ఇద్దరు అంగీకారం తప్పనిసరిగా ఉండాలి.


