రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో సత్యవేడు విద్యార్థిని ప్రత
సత్యవేడు: రాజమహేంద్రవరంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఇటీవల జరిగిన కరాటే రాష్ట్రస్థాయి పోటీల్లో సత్యవేడుకు చెందిన విద్యార్థిని ఇషాంక కాంస్య పతకం సాధించింది. ఈ నెల 25వ తేదీ రాజమహేంద్రవరంలో 69వ రాష్ట్రస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈపోటీల్లో పాల్గొన్న ఇషాంక తృతీయ స్థానాన్ని దక్కించుకుని, కాంస్య పతకం సాధించినట్లు కరాటే మాస్టర్ భువనేశ్వర్ తెలిపారు.
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
రేణిగుంట: మండలంలోని కొత్తపాళెం గ్రామ లెక్క దాఖలు సర్వే నంబర్ 120/2లోని ప్రభు త్వ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ రాళ్లను నాటా రు. గురువారం స్థానికుల సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఫెన్సింగ్ రాళ్లను తొలగించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే ఎలాంటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. గూడూరు యువకుడి మృతి
చిల్లకూరు:పొట్టకూటి కోసం ఉపాధి వెత్తుకుంటూ హైదరాబాద్ వెళ్లిన ఓ యువకు డు రోడ్డు ప్రమాదంలో బు ధవారం రాత్రి మృతి చెందినట్లు యువకుడి కుటుంబ సభ్యులు గురువారం తెలిపారు. గూడూరు రెండో పట్టణంలోని తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన కల్లూరు సురేష్ ఎలక్ట్రిషీయన్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి ఆకాష్ అనే కుమారుడు ఉన్నాడు. ఆకాష్‌ను ఉపాధి కోసం హైదరాబాద్‌కు పంపారు. అక్కడ పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండే వాడు. ఈ క్రమంలో అతను రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మృత దేహం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు.
రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో సత్యవేడు విద్యార్థిని ప్రత
రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో సత్యవేడు విద్యార్థిని ప్రత


