అప్పు చేసి కట్టుకున్నా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మా ఊరికి దగ్గరలో ని ప్రభుత్వ భూమిలో అప్ప టి రెవెన్యూ అధికారుల అను మతితోనే రేకుల ఇల్లు నిర్మించుకున్నా. అది కూడా అప్పు చేసి కట్టుకున్నా. ఇప్పు డు అక్రమ కట్టడం అంటూ అదే రెవెన్యూ అధికారు లు వచ్చి కూల్చివేశారు. టీడీపీ నేతలు మాలాంటి పేదవాళ్లను వేధించడం సరికాదు. ఇప్పుడు ఎక్కడకు పోవాలో తెలియడం లేదు. – స్నేహ
రూ.3లక్షల నష్టం
రెవెన్యూ అధికారులు నిర్వాకానికి రూ.3లక్షలు నష్టపోయాం. అప్పట్లో ఇల్లు కట్టుకోమని చెప్పింది ఈ రెవెన్యూ అధికారులే. ఇప్పుడు టీడీపీ నేతల మాటలు విని అక్రమ కట్టడాలు అంటూ నిలువునా కూల్చేశారు. సొంతిల్లు నిర్మించుకోవాలని అప్పుచేసి కట్టుకున్నా. ఇప్పుడుఇల్లు పోయింది అప్పు మిగిలిపోయింది, దిక్కుతోచడం లేదు. – హైమావతి
నిబంధనల ప్రకారమే..
మూడేళ్ల క్రితం ప్రభుత్వ భూమిలో కొందరు రేకుల ఇళ్లు నిర్మించుకున్నారు. వాటిపైన వారు హైకోర్టులో కేసు కూడా వేశారు. హైకోర్టు సూచనల ప్రకా రం విచారణ చేపట్టాం. నిబంధనల ప్రకారం ముందుగా నోటీసులు అందించి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నాం.
– చంద్రశేఖర్‌రెడ్డి, తహసీల్దార్, రేణిగుంట
అప్పు చేసి కట్టుకున్నా..
అప్పు చేసి కట్టుకున్నా..


