ఒకే డివిజన్‌లో కలపడం మంచిదే
వెంకటగిరి(సైదాపురం) : వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలు గూడూరు డివిజన్ కిందే ఉండడం, ఒకే జిల్లా పరిధిలో ఉండడం నియోజకవర్గ ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్‌జేఆర్ భవనంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అప్పటి సీఎం వైఎస్ జగన్‌ను తప్పుదారి పట్టించి వేర్వేరు డివిజన్‌ల్లో ఉంచారన్నారు. పునర్వీవ్యవస్థికరణలో అన్నీ మండలాలు గూడూరు రెవెన్యూ డివిజన్‌లోకి తీసుకొస్తామన్న ప్రభుత్వం నిర్ణయంపై ఇప్పటికీ జిల్లా మంత్రిగా ఉన్న ఆనం ఎలా స్పందిసారో వేచి చూడాలన్నారు. వెంకటగిరిని రెవెన్యూ డివిజన్‌న్‌చేయాలన్నారు.


