ప్రాంగణ ఎంపికలో పలువురికి ఉద్యోగాలు
తిరుపతి సిటీ : స్థానిక కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కాలేజ్ బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో సుమారు 11 మంది విద్యార్థులు రూ. 2.88 లక్షల వార్షిక వేతనంతో ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి మాట్లాడుతూ.. తమ దగ్గర చదివిన ప్రతి విద్యార్థి తమ కోర్సు పూర్తయ్యే లోపు ఉద్యోగం పొందడానికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఎంపిక కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ జయచంద్ర, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి, కంపెనీ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.


