అధ్యక్షా.. సమస్యలు ఆలకించండి
తిరుపతి సిటీ : తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ దద్దరిల్లింది. రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యార్థులతో అమరావతిలో ఏర్పాటు చేసిన మాక్ అసెంబ్లీలో తిరుపతి జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. రాష్ట్ర ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మాక్ అసెంబ్లీకి జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందులో గూడూరు జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నుంచి సాగర్ కుమార్ వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరించగా తిరుచానూరు జెడ్‌పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థిని చిన్మయిశ్రీ మానవ వనరుల శాఖా మంత్రిగా మాక్ అసెంబ్లీలో హల్ చెల్ చేస్తూ ప్రత్యర్థుల ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధాలు ఇవ్వడం అబ్బుర పరిచింది. సైదాపురానికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన వెంకట దినకరన్ మార్షల్ పాత్రలో ఆకట్టుకున్నారు.
అధ్యక్షా.. సమస్యలు ఆలకించండి


