బతుకుదెరువు కోసం వచ్చి బలయ్యారు!
– గ్యాస్ లీక్‌తో ఇద్దరు దుర్మరణం
వెంకటగిరి రూరల్:ఎక్కడో పుట్టారు.. ఎక్కడో పెరిగారు.. బతుకు దెరువు కోసం ఊరు గాని.. ఊరు వచ్చి.. గ్యాస్ ప్రమాద రూపంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒకరు, చీరాలకు చెందిన మరొకరు దుర్మరణం చెందడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన శ్రీ కాళహస్తి రూరల్ మండలం వెల్లంపాడు సోమనీ టైల్స్ ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. టైల్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీతో బుధవారం ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆ కంపెనీ అంబులెన్స్‌లో వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పోతురాజు (34), ఒడిశా రాష్ట్రానికి చెందిన సాయి అరవింద పాండ్య (25) మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎలక్ట్రీషియన్ సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న బాలాజీ తలకు తీవ్ర గాయం కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగై వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. ఒడిశాకు చెందిన సౌభాగ్యనాయక్ , మరో మహిళకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స అందించారు. ఈ మేరకు శ్రీకాళహస్తి పోలీసుల నివేదికల ఆధారంగా పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు వైద్యులు తెలియజేశారు.
బతుకుదెరువు కోసం వచ్చి బలయ్యారు!
బతుకుదెరువు కోసం వచ్చి బలయ్యారు!


