తిరుపతి రూరల్ : శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం లీగల్ సపోర్ట్ సెంటర్ , న్యాయశాఖ విభాగం ఆధ్వర్యంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి ఎం.గురునాథ్, పదవ అదనపు జిల్లా జడ్జి రామచంద్రుడును సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. న్యాయ విద్యార్థినులుగా రాజ్యాంగ విలువలను పాటించాలన్నారు. అనంతరం తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి ఎం.గురునాథ్ మాట్లాడుతూ.. తిరుపతి జిల్లా కోర్టులో నిత్యం జరిగే రాజ్యాంగ పరమైన అంశాలను విద్యార్థులకు వివరించారు. పదవ అదనపు జిల్లా జడ్జి రామచంద్రుడు మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువలు ప్రతి మనిషికి దిశా నిర్దేశంగా నిలుస్తాయన్నారు. రిజిస్టార్ ఆచార్య ఎన్. రజనీ మాట్లాడుతూ.. బాధ్యతలను ప్రతి ఒక్కరూ తమ జీవిత మార్గంగా మార్చుకోవాలని తెలిపారు. కార్యక్రమానికి డీన్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్ ఆచార్య సి.వాణి.. పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. అంతకు ముందు వర్శిటీ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు.


