‘సీఎండీ’కి 67 సమస్యలు
తిరుపతి రూరల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ సీఎండీ’కి విశేష స్పందన లభిస్తోంది. సోమవారం తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి 67 మంది ఫోన్ చేసి తమ సమస్యలు వెల్లడించారు. స్పందించిన సీఎండీ శివశంకర్ మాట్లాడుతూ త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం మూడు వారాలుగా డయల్ యువర్ సీఎండీకి వచ్చిన ఫిర్యాదులపై నోడల్ అధికారులతో సమీక్షించారు. ఈ క్రమంలోనే వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్లు: 1912, 1800 425 155333కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబరు: 91333 31912కు చాట్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చునని సీఎండీ సూచించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్‌ఖాన్, కె. గురవయ్య, కె.రామమోహన్‌రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు పీహెచ్ జానకిరామ్, జె.రమణా దేవి, ఎన్.శోభావాలెంటీనా, కె.ఆదిశేషయ్య, యం.మురళీకుమార్, పి.సురేంద్ర నాయుడు, జనరల్ మేనేజర్లు చక్రపాణి, రాజశేఖర్ రెడ్డి, సురేంద్ర రావు, భాస్కర్‌రెడ్డి, ప్రసాద్, వెంకటరాజు, విజయన్ పాల్గొన్నారు.


