నగరి : పుత్తూరులోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ చేపట్టింది. నగరం రోడ్డు, బజారువీధి, తేరువీధి, తిరుపతి రోడ్డు మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ఆమె వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, నియోజకవర్గ పరిశీలకు రాహుల్‌రాజారెడ్డితో కలిసి తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు.
శ్రీకాళహస్తి:స్థానిక శ్రీరామ్‌నగర్ కాలనీలోని పార్టీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల తో కలిసి ఆర్‌డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను సహించమంటూ నినాదాలు చేశారు. తప్పుడు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, శ్రీకాళహస్తీశ్వరాలయ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, పార్టీ పరిశీలకుడు ఓడూరు గిరిధర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవనాయుడు, పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు, పట్టణవాసులు పాల్గొన్నారు.
వెంకటగిరి : పట్టణంలోని నేదురుమల్లి బంగళా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు, కార్యకర్త లు, విద్యార్థులు పెద్దసంఖ్యలో ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్‌సీపీ స్టేట్ ఎగ్జిక్యూ టివ్ కౌన్సిల్ మధుసూదన్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు కోడూరు కల్పలత పాల్గొన్నారు.
చంద్రగిరి : తిరుచానూరు ఘంటసాల విగ్రహం నుంచి పంచాయతీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు కదంతొక్కారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, పెద్దసంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
● చంద్రబాబు ప్రభుత్వంపై వెల్లువెత్తిన నిరసన ● భారీ ర్యాలీలతో కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు ● స్వచ్ఛందంగా హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు ● ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ హోరెత్తిన నినాదాలు
●
పేదలంటే బాబుకు గిట్టదు
మహోన్నత ఆశయంతో జగనన్న నెలకొల్పిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. కేవలం డబ్బులకు ఆశపడి కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారు. ఆయనకు పేదలంటే గిట్టదు. ప్రజా సంక్షేమం పట్టదు. ఇప్పటికై నా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌సీపీ
తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు
పగల్బాలు తప్ప ప్రయోజనం లేదు
కేంద్ర ప్రభుత్వం సైతం మాపైనే ఆధారపడి ఉందని చంద్రబాబు పగల్బాలు పలకడం తప్ప రాష్రానికి ప్రయోజనం ఏమీ లేదు. వైద్యకళాశాలల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు రూ.5వేల కోట్లు తేలేకపోయారు. ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తున్న చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్ తగిన మూల్యం చెల్లిస్తారు.
– ఆర్‌కే రోజా, మాజీ మంత్రి
బాబు పాలన దుర్మార్గం
రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గంగా పాలన సాగిస్తున్నారు. పేదలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలను భగ్నం చేస్తున్నారు. మేలు చేస్తారని ప్రజలు గెలిపిస్తే, పెత్తందార్లకు అండగా నిలుసూ.. పేదలకు తీరని ద్రోహం చేస్తున్నారు.
– బియ్యపు మధుసూదన్‌రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి
జగనన్నకు పేరు వస్తుందనే..
పేదలకు నాణ్యమైన వైద్యం, పేద విద్యార్థులకు ఉచితంగా వైద్యవిద్యను అందించాలనే జగనన్న 17 మెడికల్ కాలేజీలన నెలకొల్పారు. అయితే అవి పూర్తి చేస్తే జగనన్నకు మంచి పేరు వస్తుందనే చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. రాజకీయ కక్షతో ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఇది క్షమించరాని విషయం. – భూమన అభినయ్‌రెడ్డి,
తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త
స్వార్థ ప్రయోజనాల కోసమే..
కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే మెడికల్ కాలేజీలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. తన అనూయాయులకు కళాశాలలను కట్టబెట్టి రూ.వేల కోట్లు దండుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. ఓటేసి గెలిపించిన ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారు. రాష్ట్ర ఆస్తిని పరులపాలు చేసేందుకు తెగబడుతున్నారు.
– చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి,
చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త
ప్రజా సంక్షేమం పట్టదు
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయనకు ప్రజా సంక్షేమం పట్టదు. కార్పొరేట్లకే వంత పాడుతుంటారు. అందులో భాగంగానే ఉన్నత ఆశయంతో జగనన్న స్థాపించిన ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. – నూకతోటి రాజేష్,
సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త
పోరాటం ఆగదు
మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు. జగనన్న పిలుపును అందిపుచ్చుకుని జనం స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వైఎస్సార్‌సీపీ వెంట అడుగులు వేస్తున్నారు. చంద్రబాబుకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారు.
– నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి,
వెంకటగిరి సమన్వయకర్త
తిరుపతి అర్బన్ : కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్రం అతలాకుతలమైనప్పుడు వైద్యసిబ్బంది తమ ప్రాణాలకు తెగించి లక్షలాది మందికి ఊపిరి పోశారు. ఆ సమయంలో కరోనా బాధితులకు చికిత్సలందించేందుకు తగినంత మంది వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. నిపుణులైన వైద్యులను తయారు చేయాలని సంకల్పించింది. ఆ మేరకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతంగా ఆలోచించి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారు. అవసరాలకు అనుగుణంగా వైద్యుల సంఖ్యను పెంచేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలోనే యుద్ధప్రాతిపదికన 5 మెడికల్ కాలేజీలను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు. మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉండగా, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ వైద్యకళాశాలలపై శీతకన్ను వేసింది. వీటిని పూర్తి చేస్తే వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే కుట్రపూరిత ఆలోచనలతో రాష్ట్ర ప్రయోజనాలను సైతం తుంగలో తొక్కింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు తెగబడింది. తద్వారా రూ.వేల కోట్లను దోచుకునేందుకు పన్నాగం పన్నింది. ఈ మేరకు బాబు సర్కారు దుర్మార్గపు పాలనపై వైఎస్సార్‌సీపీ నిరసన గళం విప్పింది. ముందుగా కోటి సంతకాల సేకరణతో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా బుధవారం జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ భారీ ర్యాలీలు చేపట్టింది.
వెన్నుపోటు బాబుకు అలవాటే..
చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం అలవాటే. సాధారణంగా పార్టీలు, నేతలకు టోపీ పెడుతుంటారు. ఈ పర్యాయం నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలకు స్వభావ సిద్ధంగా వెన్నుపోటు పొడుస్తున్నారు. రాష్ట్రంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా వైద్యులను అందించే దేవాలయాల వంటి మెడికల్‌కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. ఇది దారుణం. – కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట సమన్వయకర్త
నిరుపేదలంటే చులకన
చంద్రబాబుకు మొదటి నుంచీ నిరుపేదలంటే చులకన. వారిని కేవలం ఓటర్లగానే చూస్తారు. అందుకే పేదలకు ఉచితంగా వైద్యం, పేదబిడ్డలకు వైద్య విద్యను అందించే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని వారు ఎంబీబీఎస్ చదివేందుకు వీలు లేకుండా చేసేస్తున్నారు. ఇలాంటి పాలన సరికాదు. – మేరిగ మురళీధర్,
గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై జనాగ్రహం
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై జనాగ్రహం
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై జనాగ్రహం
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై జనాగ్రహం
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై జనాగ్రహం


