తక్షణమే సహాయక చర్యలు
రాయలచెరువుకు పడిన గండి కారణంగా ముంపునకు గురై ఆస్తి నష్టం జరిగిన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు. కళత్తూరు దళితవాడ, పాతుపాళెంను సందర్శించారు. ఆస్తి, పంటనష్టం వివరాలను పరిశీలించారు. జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ముంపు వల్ల ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణమే గృహనిర్మాణ పథకం ద్వారా ఇళ్లు నిర్మిస్తామన్నారు. పశువులను కోల్పోయిన వారికి నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు. పంట నష్టంపై పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
పరిహారం ఇలా..
ముంపునకు గురైన ఒక్కో కుటుంబానికి రూ.3వేలు, బియ్యం 25 కేజీలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కందిపప్పు, పామాయిల్, చక్కెర ఒక్కో కేజీ చొప్పున అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. చనిపోయిన పశువుకు రూ.50వేలు, మేకకు రూ.7,500 చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.


