ఇంటర్నేషనల్ లెవెల్ డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ
తిరుపతి మంగళం : తిరుపతి జీవకోన మార్గంలోని సత్యనారాయణపురం జెడ్పీ హైస్కూల్ పాఠశాల విద్యార్థులకు సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ పుణే – మహారాష్ట్ర వారు సెప్టెంబర్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ లెవెల్ డ్రాయింగ్ కాంపిటీషన్‌లో 5 అవార్డులు, బంగారు పతకాలను సాధించినట్లు గురువారం పాఠశాల హెచ్‌ఎం సంధ్యారాణి తెలిపారు. 9వ తరగతి చదువుతున్న ఆర్.సహీన, (పెయింటింగ్), వి.జ్యోతిప్రియ (హ్యాండ్ రైటింగ్), బి.జ్ఞానప్రకాష్ నాయక్ (డ్రాయింగ్ అండ్ పెయింటింగ్), 8వ తరగతి చదువుతున్న ఎం.స్పందన (హ్యాండ్ రైటింగ్ ), పొందూరు నవ్య (రంగోలి) పోటీల్లో ప్రతిభ చూపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ అవార్డులు కై వసం చేసుకోవడానికి విద్యార్థులకు మెళకువలు నేర్పిన డ్రాయింగ్ మాస్టర్ శ్రీనివాసులును కూడా అభినందించారు. కార్యక్రమంలో హిందీ పండిట్ అశోక్ ,పిడి విద్యాలత, ఉపాధ్యాయులు ఉన్నారు.


