రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జు
చిల్లకూరు : జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు నుజ్జునుజ్జు కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి కి.మీ. మేర ట్రాఫిక్ అంతరాయం కలిగిన ఘటన గురువారం వెలుగు చూసింది. వివరాలు ఇలా.. కావలికి చెందిన ఇద్దరు యువకులు చైన్నె ఎయిర్‌పోర్టు నుంచి కారులో స్వగ్రామానికి వస్తుండగా కోట క్రాస్ రోడ్డు సమీపంలో ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు గేదెలు అడ్డు రావడంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. వెనుకే వెళ్తున్న వీరి కారు బస్సును వెనుకభాగంలో ఢీకొనగా.. వీరి వెనుక చైన్నె నుంచి నెల్లూరుకు కూరగాయల లోడుతో వెళ్తున్న మినీ లారీ ఢీకొట్టింది. దీంతో కారు ముందు, వెనుక భాగాలు నుజ్జునుజ్జు కాగా, కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో ఇద్దరు యువకులు క్షేమంగా బయట పడ్డారు. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై సుమారు కి.మీ. మేర ఇరువైపులా వాహనాలు ఆగిపోయాయి. పోలీసులు కారును పక్కకు లాగి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


