పోలియో రహిత ప్రపంచమే లక్ష్యం
చంద్రగిరి: పోలియో రహిత ప్రపంచమే లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ బెంగళూరు రోటరీ క్లబ్ సభ్యులు చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం చంద్రగిరికి చేరుకుంది. బెంగళూరు నుంచి తిరుపతి వరకు సైకిల్‌పై యాత్ర సాగిస్తూ పోలియో మహమ్మారి నిర్మూలనే ధ్యేయంగా పది మంది సైకిల్‌పై యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రగిరి కోట వద్ద పలువురు పర్యాటకులకు పోలియో నిర్మూలన ప్రాధాన్యతను వివరించారు. రోటరీ క్లబ్ బెంగళూరు జిల్లా గవర్నర్ బీఆర్ శ్రీధర్ మాట్లాడుతూ మన దేశంలో 12 ఏళ్లుగా పోలియో కేసులు నమోదు కాలేదన్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లో ఇప్పటికీ పోలియో కేసులు నమోదవున్నాయని వెల్లడించారు. ప్రపంచమంతా పోలియో రహితంగా మారడమే రోటరీ క్లబ్ ప్రధాన లక్ష్యమని వివరించారు. క్లబ్ ప్రతినిధులు హేమచంద్ర, రాజేంద్ర శెట్టి, సోము రవికుమార్ పాల్గొన్నారు.


