‘పరివాహన్’పై అవగాహన శూన్యం
గతంలో ఎవరైనా వాహనం కొనుగోలు చేస్తే ప్రాంతీయ రవాణా శాఖ అధికారి (ఆర్టీఏ) కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసేవారు. ఈ ప్రక్రియను మొదటి దశలో ప్రైవేటు రంగానికి అప్పగించారు. వాహనం కొనుగోలు చేసిన వెంటనే డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు.
స్కూల్ బస్సులు, లారీలు, వ్యాన్లు, ఆటోల వంటి వాటికి ప్రతి రెండేళ్లకోసారి ఫిట్‌నెస్ పరీక్షలు(ఎఫ్‌సీ) నిర్వహించాలి. రవాణా శాఖ విధుల్లో ఇది అత్యంత కీలకమైనది. ఫిట్‌నెస్ పరీక్షలు చేసేటప్పుడు ఏ చిన్న లోపం ఉన్నా రిజెక్ట్ చేసేవారు. తద్వారా వాహనాల కండిషన్‌లో ఉండడమే కాకుండా ప్రమాదాల బారిన పడే అవకాశం తక్కువగా ఉండేది. ఇప్పుడు ఎఫ్‌సీ జారీని ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. వీటిపై కనీస పర్యవేక్షణాధికారం కూడా రవాణా శాఖకు లేకుండా చేశారు. దీంతో వాహనాల కండిషన్ సరిగ్గా లేకపోయినా ప్రైవేట్ ఏజెన్సీలు ముడుపులు తీసుకుని సర్టిఫికెట్లు జారీ చేసేస్తున్నారు. ఎఫ్‌సీల ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్ నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గం రాచగున్నేరి వద్ద నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ క్రమంలోనే డ్రైవింగ్ లెసెన్స్ జారీని కూడా ట్రైనింగ్ సెంటర్లకు అప్పగించనున్నారు. ఇందులో వాహనదారులకు 25రోజుల పాటు శిక్షణ ఇచ్చి లైసెన్సులు జారీ చేయించే దిశగా చర్యలు చేపడుతున్నారు.
రవాణా శాఖ పరిధిని కుదించడంతో అధికారులు కేవలం రోడ్లపై వాహనాలను తనిఖీ చేసి, చలానాలు రాసేందుకే పరిమితమవుతున్నారు.
సేవలన్నీ విడతల వారీగా ప్రైవేటు పరం
ఎఫ్‌సీ జారీ సైతం కట్టబెట్టిన వైనం
ఇదే బాటలో డ్రైవింగ్ లైసెన్సుల
అప్పగింతకు సన్నద్ధం
కాగిత రహిత సేవలకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర రవాణా శాఖ 2019లో పరివాహన్ యాప్‌ను అందు బాటులోకి తెచ్చింది. దీని ద్వారా రవాణా శాఖకు సంబంధించిన 16 రకాల సేవలు పొందవచ్చు. కానీ, యాప్‌పై వాహన యజమానులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించలేదు. అలాగే యాప్ నిర్వహణ సైతం సక్రమంగా లేకపోవడంతో వాహన యజమానులు పర్మిట్లు, లైసెన్సుల కోసం ప్రైవేటు ఏజెన్సీలను ఆశ్రయించాల్సి వస్తోంది. రవాణా శాఖలో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష పాసైన తర్వాత వచ్చిన మెసేజ్ ఆధారంగా వాహన చోదకులు మీ–సేవ కేంద్రాలకు వెళ్లి ఆ పత్రాలు తీసుకోవాల్సి వస్తోంది. వీటిని ఉచితంగా ఇవ్వాల్సిన నిర్వాహకులు రూ.20 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. అదే కార్డు రూపంలో కావాలంటే రూ.100 నుంచి రూ.150 వరకూ చెల్లించాల్సి వస్తోంది. టూ వీలర్, ఫోర్ వీలర్ లైసెన్సులు, రెన్యువల్‌కు వచ్చే వారికి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ, ఆటో, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సులకు వచ్చే వారిలో అత్యధికులు నిరక్షరాస్యులే ఉంటారు. వారిని రవాణా కార్యాలయానికి తీసుకువెళ్లి ఓటీపీ చెప్పిన అనంతరం దరఖాస్తు చేయించాల్సి వస్తోంది. కాగిత రహితంగా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి పూర్తి విరుద్ధంగా ఈ తతంగం సాగుతోంది.
డబ్బులు ఇస్తేనే..
ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఎస్)లను ఇప్పటికే ఇతర జిల్లాల్లో ఏర్పాటు చేసింది. వాటి నిర్వాహకులు కావాల్సిన సర్టిఫికెట్ ప్రకారం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆటో యూనియన్లు, రవాణా కార్మిక సంఘాలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని పర్యవేక్షించే అధికారం రవాణాశాఖకు లేకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. జిల్లా మొత్తానికి శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నేరి వద్ద ఒకే ఒక్క ఏటీఎస్ ఏర్పాటు చేశారు. దీంతో జిల్లా సరిహద్దు ప్రాంతాల వారు ఎఫ్‌సీ కోసం సుమారు 70 కిలోమీటర్లు రావాల్సి వస్తోంది.
శ్రీకాళహస్తి సమీపంలపోని రాచగున్నేరి వద్ద ప్రైవేటు ఏజెన్సీ ఏర్పాటు చేస్తున్న వాహన ఫిట్‌నెస్ పరీక్షల సెంటర్
జిల్లాలో వాహనాల వివరాలు
ప్రయాణికుల బస్సులు 3,551
స్కూల్ బస్సులు 1,105
గూడ్స్ క్యారియర్లు 19,427
కార్లు 23,541
త్రీ వీలర్లు 47,388
అగ్రికల్చర్ ట్రాక్టర్లు 10,858
కమర్షియల్ ట్రాక్టర్లు 9,802
ఇతర వాహనాలు 9,012
తిరుపతి మంగళం : రవాణాశాఖ కార్యాలయాలు గతంలో వాహనదారులతో నిత్యం కళకళలాడుతుండేవి. క్రమేణా రవాణా శాఖ సేవలన్నీ దాదాపు ప్రైవేటు పరమైపోయాయి. మొత్తం 86 సేవల్లో ఎల్‌ఎల్‌ఆర్ మినహా మిగిలినవన్నీ బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఎల్‌ఎల్‌ఆర్‌ను కూడా ప్రైవేటుకు కట్టబెట్టేందుకు సర్కారు యత్నిస్తోంది. దీంతో రవాణా రంగం ప్రైవేటు నిర్వాహకుల ఇష్టారాజ్యం కానుంది. వాహనదారులను నిలువు దోపిడీ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వమే కల్పిస్తోంది.అంతా ప్రైవేట్ పరం కావడంతో జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.
ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం
రవాణాశాఖను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం


