హర్షిత్‌రెడ్డికి మరింత బాధ్యత
తిరుపతి రూరల్ : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి మరింత బాధ్యతలు అప్పగించారు. పార్టీ విద్యార్థి విభాగం జోన్–4 కింద ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఆదివారం ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ క్రమంలో పలువురు నేతలు, విద్యార్థి విభాగం నాయకులు పెద్దసంఖ్యలో చెవిరెడ్డి నివాసానికి చేరుకుని హర్షిత్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. హర్షిత్‌రెడ్డి, మోహిత్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణను విద్యార్థి విభాగం నేతలు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, నేతలు చెంగల్ రెడ్డి, వినోద్ కుమార్, యశ్వంత్ రెడ్డి, శేషారెడ్డి, వీర నాగేందర్, వెంకటరమణ నాయక్, రెడ్డి ప్రసాద్ నాయుడు, కత్తి నాగార్జున, కరుణాకర్, కాజాపీర్, వినోద్, శ్రీకాంత్, హరికృష్ణ, శివ, శేఖర్, రెడ్డి నాయక్, సాగర్ నాయక్ పాల్గొన్నారు.


