కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం

Oct 23 2025 9:24 AM | Updated on Oct 23 2025 9:24 AM

కుర్ర

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం

జల దిగ్బంధంలో పల్లెలు..పట్టణాలు

తిరుపతిలో నీట మునిగిన

లోతట్టు ప్రాంతాలు

ఇళ్లలోకి వరద చేరడంతో ప్రజల అవస్థలు

పలు చోట్ల స్తంభించిన రాకపోకలు

నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులు

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌

0877– 2236007

రేణిగుంట : జి.పాళ్యం పంచాయతీ పరిధిలోని కుర్రకాల్వ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. చెరువు కలుజు కింద అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్‌ వేసి ప్రహరీ గోడను నిర్మించారు. దీంతో భారీ వర్షం వస్తే ప్రమాదం తప్పదని సాక్షి పత్రికలో పలు కథనాలు సైతం ప్రచురితమయ్యాయి. ఆ కథనాలను ఇరిగేషన్‌ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు నిండు కుండలా మారి కలుజు ప్రవహిస్తోంది. అయితే అడ్డుగా అక్రమ లేఅవుట్‌ ప్రహరీ గోడ ఉండడంతో నీరు పైకి ఎగదన్నుతూ ఉంది. ఈ క్రమంలో చెరువు కట్ట తెగిపోయే ప్రమాదముంది. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి ప్రహరీగోడను తొలగించకుంటే కుర్రకాల్వ గ్రామాన్ని వరద ముంచెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి అర్బన్‌ : జిల్లావ్యాప్తంగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని, అంద రూ అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ నరసింహులుతో కలిసి అధికారులతో సమీక్షించారు. గురువారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. రేణిగుంటలో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశమున్న శ్రీకాళహస్తి, సూళ్లూరుపేటతోపాటు సముద్రతీర ప్రాంతాలైన కోట, వాకాడు, తడలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల ని కోరారు. మత్స్యకారులను అప్రమత్తం చేయాలని చెప్పారు. చెరువులతోపాటు ప్రాజెక్టుల్లో నీటి మట్టం ఏ స్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌– 0877–2236007ను పరిశీలించారు. హెల్ప్‌డెస్క్‌కు వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. సమావేశంలో డీపీఓ సుశీలాదేవి, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్‌, అగ్రికల్చర్‌ జేసీ ప్రసాద్‌రావు, ఉద్యానశాఖ జిల్లా అధికారి దశరథరామిరెడ్డి, సీపీఓ రాజశేఖర్‌, ఇరిగేషన్‌ అధికారి వెంకటశివారెడ్డి పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లోకి వరద

కలెక్టరేట్‌ భవనం సెల్లార్‌లోకి వరద నీరు చేరింది. దీంతో ఉద్యోగులు తమ వాహనాలను పార్కింగ్‌ చేసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

కొట్టుకుపోయిన రింగ్‌బండ్‌

ఏర్పేడు : మండలంలో స్వర్ణముఖీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గోవిందవరం, పాతవీరాపురం వద్ద లోలెవల్‌ కాజ్‌వేలపై నీటి ప్రవాహం పెరిగింది. అలాగే చెన్నంపల్లి, పెన్నగడ్డం గ్రామాలకు వెళ్లే నక్కలవంక వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే జంగాలపల్లి కలుజు వద్ద తాత్కాలికంగా నిర్మించిన రింగ్‌బండ్‌ కొట్టుకుపోయింది.

మల్లె మడుగు పరిశీలన

రేణిగుంట మండలంలోని మల్లె మడుగు రిజర్వాయర్‌ను బుధవారం సాయంత్రం జాయింట్‌ కలెక్ట మౌర్య, ఏఎస్పీ రవిమనోహరాచారి, ఆర్‌డీఓ భానుప్రకాష్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఇంజినీరింగ్‌ అధికారులు పరిశీలించారు.

అల్లకల్లోలంగా సముద్ర తీరం

వాకాడు: వాయుగుండంగా ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తూపిలిపాళెం తీరం వద్ద సాధారణం కంటే 15 మీటర్లు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో మత్స్యకారులందరిన అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్వర్ణముఖి బ్యారేజ్‌లో వరదనీరు అధికంగా చేరడంతో 7 గేట్ల ద్వారా 7 వేల క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలి పెట్టారు.

వాకాడు : ఉవ్వెత్తున్న ఎగస్తున్న అలలు

రాపూరు మండలం పంగిలి వద్ద కొట్టుకుపోయిన రోడ్డు

తిరుమలలో నిండుకుండలా గోగర్భం డ్యామ్‌

చిల్లకూరు : తిప్పగుంట పాళెంలో వరద ఉధృతి

జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాలు

అరణియార్‌లో పెరిగిన నీటి మట్టం

నాగలాపురం: పిచ్చాటూరు మండలంలోని అరణియార్‌ రిజర్వాయర్‌లో నీటి మట్టం 26.3 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయానికి 301 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని అధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద నిఘా పెట్టినట్లు వెల్లడించారు.

కల్యాణిడ్యామ్‌కు వరద

చంద్రగిరి:ఏ.రంగంపేట సమీపంలోని కల్యాణి డ్యామ్‌ కు వరద నీరు చేరుతోంది. డ్యామ్‌ పూర్తి స్థాయి సామ ర్థ్యం 900 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 849 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం 
1
1/15

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం 
2
2/15

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం 
3
3/15

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం 
4
4/15

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం 
5
5/15

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం 
6
6/15

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం 
7
7/15

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం 
8
8/15

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం 
9
9/15

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం 
10
10/15

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం 
11
11/15

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం 
12
12/15

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం 
13
13/15

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం 
14
14/15

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం 
15
15/15

కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement