
యూరియా పంపిణీకి చర్యలు
చిట్టమూరు:‘యూరియా కోసం రైతుల ఆందోళన’ శీర్షికతో సాక్షి ప్రధాన సంచికలో బుధవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. చిట్టమూరు తహసీల్దార్ రైతులకు యూరియా అందించేందుకు చర్యలు చేపట్టారు. ముందుగా యాకసిరి గ్రామ సచివాలయంలో వీఆర్‌ఓ సునయన చేతుల మీదుగా రైతులకు యూరియా గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ యూరియా కోసం రైతులు ఇబ్బందిపడాల్సిన అవసరం లేదన్నారు. అందరికీ అందుబాటులో యూరియా ఉంచేలా వ్యవసాయాధికారుల ద్వారా చర్యలు చేపట్టామని వెల్లడించారు. రైతులకు గుర్తింపు కార్డులను అందించామని, ఆ మేరకు యూరియా పంపిణీ చేయాలని ఏఓ నిరంజన్ కుమార్‌ను ఆదేశించారు.
పోక్సో కేసులో ముగ్గురి అరెస్ట్
సైదాపురం : మైనర్ బాలికను వేధించి, కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ముగ్గురిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బుధవారం ఈ మేరకు నిందితులు నన్నేం ప్రేమ్‌రాజ్, చింత సాయి, గానుగపెంట శరత్‌కుమార్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు.

యూరియా పంపిణీకి చర్యలు