
భవిష్యత్ పరిశోధనలపై దృష్టి అవసరం
తిరుపతి సిటీ: భవిష్యత్తు పరిశోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అందుకోసం పరస్పర సహకారంపై అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ నారాయణ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్వీయూ వీసీ నర్సింగరావుతో బుధవారం వర్సిటీలోని వీసీ చాంబర్‌లో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. క్వాంటమ్ టెక్నాలజీ, హైడ్రోజన్ మొబిలిటీలో ఉమ్మడి పరిశోధన చేయడానికి చర్చలు జరిపారు. పరిశోధన అంశాలపై రెండు వర్సిటీలు సమన్వయంతో నూతన పరిశోధనల బలోపేతం చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్చించారు. ఎస్వీయూ క్వాంటమ్ టెక్నాలజీ, హైడ్రోజన్ మొబిలిటీ వంటి పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉందని వీసీ తెలియజేశారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ భూపతి నాయుడు పాల్గొన్నారు.