ప్రభుత్వాలు అడవుల పెంపకానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అయితే కూటమి నేతలు ఉన్న అడవులు నరికివేసి, కొండలను చదును చేసి, మామిడి తోటల పెంపకం పేరుతో కబ్జా చేస్తున్నారు. కొంత కాలం తరువాత గుట్టు చప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన అటవీ, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ.. కూటమి నేతలకు వంతపాడుతున్నారు. ఫలితంగా పచ్చదనం కరిగిపోతోంది.
కొండను చదును చేస్తూ, వాహనాల్లో మట్టిని లోడ్‌ు చేస్తున్న హిటాచీ
రామచంద్రాపురం: రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే అటవీభూములు కనుమరుగైపోతాయి. 2014–19 నాటి ఆక్రమణలు ఏడాదిన్నర కాలంగా మళ్లీ ఊపందుకున్నాయి. కూటమి నేతలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడంటూ పెట్రేగిపోతున్నారు. అధికారం ఉంది.. అవకాశం ఉన్న మేర అటవీ భూములను ఆక్రమించేద్దాం.. దొంగ పట్టాలు సృష్టించుకుని ఇనుప కంచెలతో హద్దులు ఏర్పాటు చేసుకుని, కేంద్ర పథకం ఎన్‌ఆర్జీఎస్ నిధులతో మామిడి తోటలు పెంపకం, ఆపై రూ.కోట్లకు ఎన్నారైలకు భూములను విక్రయించేస్తున్నారు. అనుపల్లి, సి.రామాపురం, గుండోడు కనం, చిట్టత్తూరు, రాయలచెరువు, పిల్లారి కొండలు కబ్జా కోరల్లో చిక్కి భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని మండల ప్రజలు లబోదిబోమంటున్నారు. ప్రజల ఆస్తులను ప్రకృతి సంపద కాపాడాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు విధులను విస్మరించి, పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారంటూ స్థానిక ప్రజలు వాపోతున్నారు.
విద్యుత్ శాఖ సహకారం
రైతులు, సామాన్య ప్రజలకు విద్యుత్ కనెక్షన్లు కావాలంటే నెలలు తరబడి కార్యాలయల చు ట్టూ ప్రదక్షిణలు చేస్తూ, అధికారుల చేయి తడపనిదే సామాన్యుల పనులు ముందుకు సాగవు. అయితే అటవీ భూముల అక్రమణదారులకు, కూటమినేతల నివాసాల వద్ద అధికారులే పడిగాపులు కాసి, ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్న సందర్భాలను చూసి ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.
రెవెన్యూ మౌనమెందుకు?
రామచంద్రాపురంలో జరుగుతున్న అటవీ భూములను, ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుంటూ.. ప్రజా సంపదను లూటీ చేస్తున్న రూ.కోట్ల విలువచేసే మట్టిని, భూములను కొల్లగొడుతున్న పట్టీపట్టనట్టు చోద్యం చూస్తున్న రెవెన్యూ సిబ్బందిపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. చట్టాలు, శిక్షలు సామాన్యులకేనా? కూటమి నాయకులకు వర్తించవా? అంటూ బహిరంగంగా నే ప్రజలు విమర్శిస్తున్నారు. సామాన్య రైతులు పట్టా భూములను ఆన్‌లైన్, పాస్ బుక్ చేసుకోవాలన్న ఏళ్ల తరబడి తహసీల్దార్ కార్యాలయాలు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా తమ ఫైళ్లు ముందుకు కదలవని, అక్రమణ దారులకు, కూటమి నేతలకు మాత్రం అన్నీతామై కబ్జాదారుల పనులు సజావుగా సాగేలా అధికారులు విధులు నిర్వహిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
అటవీ భూముల్లో మట్టి
చదును చేస్తున్న జేసీబీ
రెవెన్యూ వ్యవస్థపై మండిపాటు
మండలంలో రెవెన్యూ వ్యవస్థ పనితీరుపై ప్రజలు మండిపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటవీ భూములు ఆక్రమణలకు అడ్డుకట్ట వేయలేక భూ బకాసురుల చేతులో బందీలుగా మారారు. అనుపల్లి సర్వే లెక్కల దాఖలాలో 411, 480లో గతంలో ఎన్నడూ లేని పట్టాలను సృష్టించుకుని అటవీ భూములను అదును చూసి చదును చేస్తున్నారు. గతంలో అటవీ భూముల ఆక్రమణలపై ప్రభుత్వ అనుకూల పత్రికలో ప్రచురితమైన కథనాల మేరకు అప్పటి జిల్లా అధికారులు స్పందించి బోగస్ పట్టాలను రద్దు చేసి, ఆక్రమణలను అడ్డుకున్నారు. మండల కేంద్రానికి 15 మైళ్ల దూరంలో అనుపల్లి అటవీ భూములున్నాయి. భారీ యంత్రాలతో రేయింబవళ్లు చదును చేస్తున్నారని, జిల్లా అధికారులకు సమాచారం తెలిసి వారువచ్చే సమయానికి మండల అధికారులు కూటమి నేతలకు సమాచారం చేరవేయడంతో అక్రమణదారులు అప్రమత్తమై యంత్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి రాత్రి సమయంలో పనులను సజావుగా సాగిస్తున్నారని అనుపల్లి, కూనేపల్లి ప్రజలు మండిపడుతున్నారు.
నిరసన చేపడతాం
తమ పశువులు, జీవాలు మేతకు అటవీ భూములు ఆశ్రయంగా ఉండేవని ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకొని ఇనుప కంచెలు నిర్మించేశారని, భారీ యంత్రాల శబ్దాలకు జంతువులు అడవులు విడిచి జనావాసాలకు వస్తున్నాయని, ఈ ఆక్రమ ణలు ఇలాగే కొనసాగితే భావితరాల భవిష్యత్తు కనుమరుగుతుందని, ఒకప్పుడు అడవులు ఉండేవని చెప్పుకొనే పరిస్థితి వస్తుందని, వర్షాలు పడక రైతులు వలసి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న వారిపై జి ల్లాస్థాయి అధికారులు, కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున అనుపల్లి కునేపల్లి ప్రజలు నిరసన చేపడతామని తెలియజేశారు.
భూ చోళ్లు