
జమేదారు బదిలీ
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తురాలిపై ఆలయంలో దాడికి పాల్పడిన జమేదారు అలివేలుపై టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలకు పూనుకున్నారు. మంగళవారం అమ్మవారి దర్శనం కోసం వచ్చిన చైన్నెకు చెందిన ఆండాళ్ అనే హిజ్రా భక్తురాలిపై కుటుంబ సభ్యుల సమక్షంలో జమేదారు అలివేలు దాడికి పాల్పడింది. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఆమెను ఆలయం నుంచి విధులను తప్పించి, అలిపిరికి బదిలీ చేశారు. గతంలోనూ ఇదే రీతిలో ఓ భక్తుడిపై దాడికి పాల్పడడంతో అప్పట్లో ఆమెను ఆలయం నుంచి బదిలీ చేశారు. కొద్ది రోజులకే కూటమి నేతల అండదండలతో ఆమె తిరిగి అమ్మవారి ఆలయానికి తిరిగి రావడం గమనార్హం. కాగా వివాదస్పద జమే దారు అలివేలును సున్నితమైన అలిపిరి సెక్టార్–5కు బదిలీ చేయడం విమర్శలకు తావ్విస్తోంది.