
పేటశ్రీకి సాహితీ పురస్కారం
తిరుపతి సిటీ : ఆచార్య పేట శ్రీనివాసులురెడ్డి (పేటశ్రీ) రచించిన తిరుపతి కథలు పుస్తకానికి సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పుర స్కారం ప్రకటించింది. ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ నాంపల్లిలోని నందమూరి తారకరామారావు కళామందిరంలో ఆయనకు అవార్డుతోపాటు రూ.2,116 నగదు బహుమతి అందించనున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న శ్రీరంగం మఠం పీఠాధిపతి
తిరుమల: తిరుమల శ్రీవారిని బుధవారం ఉడిపిలోని కానీయూరు మఠం పీఠాధిపతి విద్య వల్లభ తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. తిరుమల బేడి ఆంజనేయ స్వామి వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
పర్యావరణ పరిరక్షణ
అందరి బాధ్యత
తిరుపతి అర్బన్ : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో పర్యావరణ పరిరక్షణపై కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి కమిషనర్ మౌర్యతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణపై అవగాహన అవసరమని, రీసైక్లింగ్ చేయడం మంచిదని వెల్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్క్యులర్ ఎకానమీ దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ నాగేశ్వర రాజు, డీపీఓ సుశీలాదేవి, జిల్లా మైన్స్ అధికారి బాలాజీ నాయక్ పాల్గొన్నారు.
ఎర్రచందనం పట్టివేత
భాకరాపేట:అటవీ అధికారులు చేపట్టిన వాహన తనిఖీల్లో బుధవారం సుమారు రూ.25లక్షల విలువైన 15 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. అటవీ శాఖ అధికారి ఎన్.వెంకటరమణ, ఎఫ్‌బీఓలు వై.రాజేష్ కుమార్, ఎం.సదాశివయ్య, జి.ప్రదీప్ చంద్, సి.రవి, జేబీ నిఖిల్, డ్రైవర్లు హెచ్.శంకర్, ఎన్.రోహిత్ పాల్గొన్నారు.

పేటశ్రీకి సాహితీ పురస్కారం

పేటశ్రీకి సాహితీ పురస్కారం

పేటశ్రీకి సాహితీ పురస్కారం