
పేదల ఆస్పత్రిపై
అక్రమ నియామకాలకు స్కెచ్
నోటిషికేషన్ విడుదలపై
అనుమానాల వెల్లువ
రాజకీయ జోక్యంపై మండిపడుతున్న బీజేపీ, జనసేన శ్రేణులు
ఇంటర్వ్యూలను సైతం ప్రారంభించిన అధికారులు
చక్రం తిప్పుతున్న సీఎం సమీప బంధువు
●
పేద రోగుల ప్రాణాలకు భరోసా కల్పించాలి.. నాణ్యమైన చికిత్సలందించాలి.. నిపుణులైన వైద్యులతో సేవలందించాలి.. ఇదే లక్ష్యంతో స్విమ్స్ ఆస్పత్రిని టీటీడీ నెలకొల్పింది. ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన వైద్యాలయంలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నేతల అరాచకాలకు వేదికగా మారిపోయింది. అందులో భాగంగానే నైపుణ్యంతో పనిలేకుండా తమ అనుచరులకు కొలువులు ఇప్పించే దిశగా పచ్చగద్దలు పథకం రూపొందించారు. టీటీడీపై ఒత్తిడి తీసుకువచ్చి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సైతం విడుదల చేయించారు. ప్రజారోగ్యంతో యథేచ్ఛగా ఆడుకునేందుకు తెగబడ్డారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ేపదల వైద్యాలయంగా ప్రసిద్ధి చెందిన స్విమ్స్ ఆస్పత్రి నేడు రాజకీయాలకు వేదికగా మారుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇద్దరు టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగులకు సైతం నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదని కొందరు అధికార పార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. స్విమ్స్‌లో ఏం జరుగుతోందో తెలియదు కానీ, తాజాగా వైద్యుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇదే అదునుగా టీడీపీ నేతలు తమ అనుచరులకు అవకాశం కల్పించే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది.
తమ వర్గీయులకే పెద్దపీట
స్విమ్స్ ఆస్పత్రిలో నియామకాల నుంచి బదిలీలు, ప్రమోషన్ల విషయంలో టీడీపీ నేతలు తమ వర్గీయులకే పెద్ద పీట వేస్తున్నా రు. సదరు ఇద్దరు నేతల ఆదేశాల మేరకు స్విమ్స్‌లో ప్రతి ఒక్కటీ నడుస్తోందని పలువురు కూటమి నాయకులే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ అనుచరు లను వైద్యులుగా నియమించుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేయించారని చెబుతున్నారు. చివరకు బుధవారంనుంచి ఇంటర్వ్యూలు సైతం మొదలుపెట్టించారని స్విమ్స్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల ఆస్పత్రిలో రాజకీయ జోక్యం మంచి పద్ధతి కాదని వాపోతున్నారు.
మభ్య పెట్టి మంత్రాంగం
స్విమ్స్ ఆస్పత్రిలో అక్రమాలపై కొందరు కూటమి నేతలు సైతం మండిపడుతున్నారు. పేదలకు నిస్వార్థంగా సేవలు అందించాల్సిన స్విమ్స్ అధికారులు ఇద్దరు టీడీపీ నేతలకు తలొగ్గి అర్హత లేని వైద్యులను, సిబ్బంది నియమిస్తే పేదల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అక్రమ నియామకాలకు పక్కా స్కెచ్ వేసిన సదరు టీడీపీ నేతలు మంత్రాంగం నడిపి ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని మభ్యపెట్టి తమ అనుచరులకు అవకాశం కల్పించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందులో స్థానిక ఎమ్మెల్యేను డమ్మీని చేసి చక్రం తిప్పినట్లు సమాచారం.
నీరుగారిన వైద్య సేవలు
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ ఆస్పత్రిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో పేదలకు వైద్యసేవలు అందడం లేదు. ఆస్పత్రికి వచ్చే విరాళాలను సైతం కొందరు టీడీపీ నేతలు పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా పచ్చమూక అక్రమాలకు మంగళం పాడి, పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు స్విమ్స్ ఆస్పత్రిపై పెత్తనం వదిలిపెట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ క్రమంలోనే అక్రమ నియామకాలకు విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం పరిణామాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని సూచిస్తున్నారు.
పునః పరిశీలించాలి
స్విమ్స్‌లో వైద్యుల పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌ను టీటీడీ అధికారులు పున:పరిశీలించాలి. కొత్త నియామకాల విషయంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అర్హతలు, నైపుణ్యం ప్రామాణికంగా పోస్టులను భర్తీ చేయాలి. వివక్ష, రాజకీయ జోక్య లేకుండా పేద రోగుల సేవే లక్ష్యంగా భావించే వారికే అవకాశం కల్పించాలి. ప్రస్తుత నోటిఫికేషన్‌లో కొన్ని అనవసరమైన పోస్టులను చేర్చారు. వాస్తవంగా అవసరమైన వాటిని తొలగించారు. దీనిపై విమర్శలు వస్తున్నప్పటికీ ఇంటర్వ్యూలను చేపట్టడం సరికాదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నోటిఫికేషన్ రద్దు చేసి, మళ్లీ కొత్తగా విడుదల చేయాలి.
– నవీన్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నేత, తిరుపతి
స్విమ్స్‌లో తిష్ట వేసేందుకు
టీడీపీ నేతల యత్నం
సీఎం సమీప బంధువు స్విమ్స్ ఆస్పత్రిని శాసిస్తున్నారు. వైద్యుల నియామకాల్లో ఆయన చక్రం తిప్పుతున్నట్లు స్విమ్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే కొన్ని వైద్యుల పోస్టుల విక్రయాలపై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎంపిక కోసం విభాగాలుగా వేసిన అన్ని కమిటీల్లోనూ సీఎం సమీప బంధువు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. నగదు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పేదల ఆస్పత్రిపై

పేదల ఆస్పత్రిపై