
బావిలో పడి వ్యక్తి మృతి
తిరుపతి సిటీ: నగరంలోని వేదిక్ వర్సిటీ, ఎస్వీయూ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోందని విద్యార్థులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని వర్సిటీ, అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే వర్సిటీల్లో చిరుత సంచరించే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఆదివారం అర్ధరాత్రి వేదిక్ వర్సిటీలోని శైక్షిక (అకాడమిక్)భవనాల వద్ద చిరుత సంచరించిందని వెంటనే సెక్యూరిటీ అప్రమత్తమై విద్యార్థులకు సమాచారం అందించారని తెలిపారు. ఎస్వీయూ, వేదిక్ వర్సిటీలలో అటవీశాఖ సుమారు నాలుగు బోన్‌లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు సాయంత్రం ఆరు గంటలు దాటితే బయటకు రాకూడదని నిషేధాజ్ఞలు విధించారు.