
మహిళా క్రికెట్ జట్టులో ఐదుగురికి చోటు
తిరుపతి ఎడ్యుకేషన్:ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఇటీవల ప్రకటించిన ఆంధ్రా ఉమెన్స్ అండర్–19 క్రికెట్ జట్టులో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఐదుగురు చోటు సాధించినట్లు ఏసీఏ జాయింట్ సెక్రటరీ విజయ్‌కుమార్ తెలిపారు. వీరిలో గిరిష్మా సైనిరెడ్డి (వైస్ కెప్టెన్), ఎ.విష్ణుప్రియ, ఎం.పర్ణిత యాదవ్, కె.శుభశ్రీ, ఎం.రుక్సార్ తబ్సమ్ వున్నారని తెలిపారు. వీరు ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు బీసీసీఐ అండర్–19 ఉమెన్స్ టీ–20 చాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నట్లు తెలిపా రు. ఎంపికై న మహిళా క్రికెటర్లు బాగా రాణించి రంజి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతి భ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

మహిళా క్రికెట్ జట్టులో ఐదుగురికి చోటు

మహిళా క్రికెట్ జట్టులో ఐదుగురికి చోటు

మహిళా క్రికెట్ జట్టులో ఐదుగురికి చోటు

మహిళా క్రికెట్ జట్టులో ఐదుగురికి చోటు