
వరసిద్ధుని సేవలో జూనియర్ ఎన్టీఆర్ సతీమణి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని ఆదివారం సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి దర్శించుకున్నారు. ఆమెతో పాటు సినీ నటుడు నార్నె నితిన్, వారి కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగ తం పలికి దగ్గరుండి స్వామి దర్శనం కల్పించారు.
ఒకే ఊరిలో 8మంది
డీఎస్సీకి ఎంపిక
చంద్రగిరి: మండలంలోని పనపాకం పంచాయతీ అరిగెలవారిపల్లెలో 2025 డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన 8మందిని రిటైర్డ్ హెచ్‌ఎం అరిగిల రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఎంపికై న వారిలో ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా బి.లిషా నందిని, స్కూల్ అసిస్టెంట్‌గా దళవాయి సూర్య లోకనాధం, పీఈటీగా బొజ్జా సుమలత, ఎస్‌జీటీలుగా కె.దిలీప్ కుమార్, దళవాయి సురేంద్ర, ఆవుల కళ్యాణి, అరిగెల భానుప్రకాష్, డి.మహేష్ ఉన్నారు. ఒకే గ్రామంలో 8 మంది డీఎస్సీలో ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమని పలువురు వారిని అభినందించారు. నూతనంగా ఎంపికై న ఉపాధ్యాయులందరూ ఇదే స్ఫూర్తితో మరెందరో విద్యార్థుల భవితకు బాటలు వేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆవుల క్రిష్ణయ్య(గార్డు), గేనే సుబ్బయ్య, జూ పార్క్ మాజీ డైరెక్టర్ మణి యాదవ్, అరిగిల కృష్ణ, భీమరాజు, స్థానిక ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

వరసిద్ధుని సేవలో జూనియర్ ఎన్టీఆర్ సతీమణి