
గంజాయి కేసులో మరో నిందితుడు అరెస్టు
సత్యవేడు : గంజాయి కేసుకు సంబంధించి నిందితుడు విజయ్(30)ని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సీఐ మురళీనాయుడు ఆధ్వర్యంలో మీడియా ముందు నిందితుడిని ప్రవేశపెట్టారు. సీఐ మాట్లాడుతూ.. గత నెల 19న ఒకటిన్నర కిలో గంజాయిని , ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిందితుడు శ్రీధర్‌ను అరెస్టు చేశామన్నారు. మరో నిందితుడు విజయ్ పరారీలో ఉండగా శుక్రవారం గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడిని కోర్టుకు హాజరు పరిచి రిమాండుకు పంపామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ రామస్వామి, పోలీసులు ఉన్నారు.