
అది న్యాయవ్యవస్థపై దాడి
● సీజేఐపై దాడికి యత్నం దుర్మార్గం ● దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది ● ఎంపీ గురుమూర్తి
తిరుపతి కల్చరల్: భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై దాడికి యత్నించడాన్ని భారత న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా చూడాలని ఎంపీ డాక్టర్ గురుమూర్తి ఒక ప్రక టనలో తెలిపారు. దీనిని తీవ్రంగా ఖండిస్తు న్నాని పేర్కొన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిందని, న్యాయం, రాజ్యాంగ విలువలను గౌరవించే ప్రతి భారతీయుడి మనస్సాక్షిని కదిలించిందని అన్నారు. భారత న్యాయవ్యవస్థ మన రాజ్యాంగాన్ని ప్రజలకు హక్కులను కాపాడాడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన గుర్తుచేశారు. ఈ క్లిష్ట సమయంలో తాను ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయితో పాటు మొత్తం న్యాయవ్యవస్థకు మద్దతు ప్రకటిస్తున్నాని తెలిపారు. బీఆర్ గవాయి సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటూ న్యాయస్ఫూర్తిని నిలబెట్టేందుకు దేవుడు ఆయనకు మరింత శక్తి, ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.