
నేడు నారావారిపల్లికి సీఎం చంద్రబాబు
చంద్రగిరి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం స్వగ్రామం నారావారిపల్లికి రానున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్‌తో కలిసి ముందస్తు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం 11.10 గంటలకు ఏ.రంగంపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారని, అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి నారావారిపల్లి చేరుకుంటారన్నారు. అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని, అనంతరం తిరిగి 1.40 గంటలకు ఏ.రంగంపేట వద్ద ఉన్న హెలిప్యాడ్ చేరుకుని విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశాలలో భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ, హెలిప్యాడ్ వద్ద బారికేడ్ల ఏర్పాటు, నిరంతర విద్యుత్ తదితర ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.

నేడు నారావారిపల్లికి సీఎం చంద్రబాబు