
12న కురబ సంఘం వార్షికోత్సవ సభ
తిరుపతి కల్చరల్: విజయవాడలో ఈనెల 12వ తేదీన జరిగే ఏపీ కురుబ, కురుమ, కురువ సంఘం 10వ వార్షికోత్సవ సభకు రాష్ట్రంలోని కుల సంఘ నేతలు, కురబ కులబాంధవులంతా పాల్గొనాలని ఏపీ కురబ, కురుమ, కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సంఘ నేతలతో కలిసి సంఘ వార్షికోత్సవ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో కురబ భవనానికి అవసరమైన స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలో ఈనెల 12న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంఘ సభ జరుగుతుందని, అనంతరం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సౌత్ ఇండియా ఓబీసీ సదస్సు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో దేశంలోనీ బీసీలు, అన్ని రాష్ట్రాల బీసీ ప్రతినిధులు, దక్షిణ, ఉత్తర భారతదేశం రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరవుతారన్నారు.