
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ప్రణాళిక
తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు స్మూక్ష్మ, క్షేత్రస్థాయి ప్రణాళికలు రూపొందించి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో ఆయన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, టీటీడీ వివిధ విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య, జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బరాయుడు, సీఈ సత్యనారాయణ, తిరుమల ఏఎస్పీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వివరించారు.