
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై దాడి
చిల్లకూరు : గూడూరు మండలం కాండ్ర గ్రామంలో పాత కక్షలను మనస్సులో పెట్టుకొని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు శుక్రవారం రాత్రి దాడికి పాల్పడి గాయపరిచినట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఊటుకూరు మహేంద్రరెడ్డి తెలిపారు. గాయపడిన వ్యక్తి గూడూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాండ్ర గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు రాజశేఖర్ ఇంటిపైకి టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఆ సమయంలో రాజశేఖర్ అక్కడ లేకపోవడంతో అతడి తండ్రి మస్తానయ్యపై దాడికి పాల్పడడంతో అతడికి గాయాలైనట్లు చెప్పారు. గాయాలపాలైన అతడిని చుట్టు పక్కల వారు ఆసుపత్రికి తరలించారన్నారు. అలాగే రాజశేఖర్‌కు చెందిన తోట వద్దకు వెళ్లి అక్కడ ఉన్న విద్యుత్ మోటార్‌కు చెందిన వైర్లు, స్టార్లర్లు ధ్వంసం చేశారని తెలిపారు. ఈ మేరకు రూరల్ పోలీసులకు జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశామని తెలిపారు.