● భూమన కుటుంబంపై బురద జల్లేందుకు కుట్రలు ● వ్యక్తిగత కారణాలతోనే పవన్‌పై జనసేన నేత దినేష్ దాడి
తిరుపతి మంగళం: టీడీపీ కార్యకర్త.. జనసేన నాయకుడి మధ్య వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన దాడిని అడ్డు పెట్టుకుని వైఎస్సార్ సీపీ నాయకుడిని అరెస్టు చేయడంతో తిరుపతిలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న విషయం తేటతెల్లమైంది. వివరాల్లోకి వెళితే.. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేరు చెప్పుకుని పలువురిని మోసగిస్తున్న పవన్ అనే వ్యక్తికి జనసేన పార్టీకి చెందిన దినేష్ (అలి యాస్ సెటిల్‌మెంట్ దినేష్)కు మధ్య విభేదాలున్నాయి. కాగా వైఎస్సార్‌సీపీ నేత అనీల్‌రెడ్డి బైక్‌లను అద్దెకు ఇచ్చే వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో పవన్, అనీల్‌రెడ్డి వద్ద ఓ బైక్‌ను ఏడాది కిందట అద్దెకు తీసుకెళ్లి, ఇవ్వలేదు. దీనిపై అనీల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో బుధవారం పవన్ బైక్ ధరను చెల్లిస్తానని చెప్పడానికి అనీల్ కార్యాలయానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న దినేష్ అక్కడికి వెళ్లి పవన్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇదే అదునుగా భావించిన కూటమి నేతలు అనీల్‌రెడ్డి పవన్‌పై దాడి చేశాడంటూ సోషల్‌మీడియాలో వైరల్ చేసి, పోలీసు కేసు పెట్టి అరెస్టు చేయించారు. ఈ విషయమై అనీల్‌రెడ్డి భార్య మాట్లాడుతూ తమ వద్ద బైక్ అద్దెకు తీసుకెళ్లి ఏడాదిగా తిరిగి తెచ్చి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని దీంతో పవన్ పోలీసు కేసులొద్దు బైక్ ఎంత అవుతుందో చెల్లిస్తానని, కూర్చుని మాట్లాడుకుందామని తమ కార్యాలయానికి వచ్చారని తెలిపారు. ఈ విషయం జనసేన పార్టీ దినేష్ తెలుసుకుని వచ్చి పవన్‌పై విచక్షణరహితంగా దాడి చేశారని ఆమె తెలిపారు. అంతే తప్ప అ తనిపై తన భర్త అనీల్‌రెడ్డి దాడి చేయలేదని, వా రు చేసే దాడిని ఆపేందుకు ప్రయత్నించారన్నారు.
అనీల్‌రెడ్డి నన్ను కొట్టలేదు
వైఎస్సార్‌సీపీ నేత అనీల్‌రెడ్డి తనని కొట్టలేదని జనసేన నాయకుడు దినేష్ చేతిలో తీవ్రంగా గాయపడి న బాధితుడు పవన్ వీడియో ద్వారా తెలిపాడు. అ నిల్ దగ్గర తాను, నంద్యాలకు చెందిన మహేష్ అనే వ్యక్తి ఇద్దరం బైక్ అద్దెకి తీసుకున్నామని, మహేష్ అనే వ్యక్తితో కలిసి కొన్ని తప్పులు చేసిన విషయం వాస్తవమేనన్నారు. అందుకే మా అన్న దినేష్ నన్ను కొట్టాడని.. అంతే తప్ప అనీల్‌రెడ్డి కొట్టలేదని తెలిపాడు. కొందరు రాజకీయ లబ్ధి కోసం తన వీడి యోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారని, వెంటనే వాటిని తొలగించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు పవన్ వెల్లడించాడు.
భూమన కుటుంబంపై బురద జల్లేందుకు కుట్రలు
కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను చిత్తూ రు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి నిత్యం ఎండగడుతున్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక భూమన కుటుంబంపై బురదజల్లేందుకు కూటమి నాయకులు జనసేన, టీడీపీ నాయకు లు చేసిన దాడిని వైఎస్సార్‌సీపీకి, భూమన కుటుంబానికి ఆపాదిస్తూ కూటమి సోషల్ మీడియాల్లో వైరల్ చేయడమే ఇందుకు నిదర్శనం.
ఈస్ట్ పోలీసులకు వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యాదు
పవన్‌పై దాడి చేసిన జనసేన నాయకుడు దినేష్‌ను అరెస్టు చేసి, తమ పార్టీ నేత అనీల్‌రెడ్డిని విడిచిపెట్టాలని వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ యువజన విభాగం నాయకులు ఉదయ్‌వంశీ, మల్లం రవికుమార్‌రెడ్డి, దినేష్‌రాయల్, పసుపులేటి సురేష్, రమణారెడ్డితోపాటు పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన దినేష్‌ను వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకో వాలని ఈస్ట్ పోలీసులకు వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి బైక్ అద్దెకు ఇచ్చి నష్టపోయిన అనీల్‌రెడ్డిపై కేసులు పెట్టడం ఏమిటని పోలీసులను వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నించారు.
తిరుపతిలో రెడ్‌బుక్ రాజ్యాంగం
తిరుపతిలో రెడ్‌బుక్ రాజ్యాంగం