
ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌పై దాడి హేయం
తిరుపతి మంగళం:వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై టీడీపీ గుండాలు దాడి చేయడం హేయమై న చర్య అని తిరుపతి కార్పొరేషన్ మేయర్ శిరీష్ అన్నారు. ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ గురువారం తిరుపతి బాలాజీకాలనీలోని జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద మేయర్ శిరీషతోపాటు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేయర్ శిరీష మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాసంక్షేమాన్ని, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి వైఎస్సార్‌సీపీ నాయకులే లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్షలతో కూటమి నాయకులు దాడులకు పాల్పడడం రెడ్‌బుక్ రాజ్యాంగానికి నిదర్శనమన్నారు. ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు తెగబడుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసి ఉంటే ఎన్నికలకు భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అనంతరం వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ నాయీ బ్రాహ్మణ విభా గం రాష్ట్ర అధ్యక్షుడు తొండమల్ల పుల్లయ్య, తిరుపతి రూరల్ మాజీ ఎంపీపీ చిలమంద మునికృష్ణ, చిన్నియాదవ్ మాట్లాడారు. బీసీ వర్గానికి చెందిన రమేష్‌యాదవ్‌పై దాడి చేయడం అమానుషమన్నారు. రాజకీయం అంటే ప్రజాబలంతో గెలవాలే తప్ప దాడులు చేసి జనాలను భయభ్రాంతులకు గురిచేసి తద్వారా ఎన్నికల్లో గెలవాలనుకోవడం దుర్మార్గపు చర్యే అవు తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లడ్డు భాస్కర్‌రెడ్డి, కోటూరు ఆంజనేయులు, టౌన్‌బ్యాంక్ వైస్ చైర్మెన్ వాసుయాదవ్, తిరుపతి రూరల్ వైస్ ఎంపీపీ మాధవరెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌పై దాడి హేయం