
ఆగ్రహానికి గురికాక తప్పదు
కూటమి ప్రభుత్వం గత ఏడాదిగా విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. విద్యారంగంలోని సమస్యలపై ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాంటి హక్కులను హరించేందుకు కూటమి కుట్ర పన్నుతోంది. విద్యను వ్యాపారం చేస్తున్న కళాశాలపై విద్యార్థి సంఘాలు గళం విప్పితే ఆంక్షలు విధించారు. ఆంక్షలు ఎత్తివేయకపోతే ప్రభుత్వం విద్యార్థి సంఘాల ఆగ్రహానికి గురికాక తప్పదు. –బండి చలపతి,
ఏఐఎస్‌ఎఫ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి, తిరుపతి
వ్యవస్థలను చేతులోకి తీసుకుంటే ఊరుకోం
కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వ్యవస్థలను తమ చెప్పు చేతుల్లోకి తీసుకుని ఇష్టాను సారంగా వ్యహిరిస్తే ఊరుకోం. రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కులపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం ఆపకపోతే ఉద్యమం తప్పదు. తక్షణం విద్యార్థి సంఘాలపై ఆంక్షలను ఎత్తివేయాలి. లేదంటే ప్రభుత్వం మెడలు వంచుతాం. – అక్బర్, ఎస్‌ఎఫ్‌ఐ, జిల్లా అధ్యక్షులు, తిరుపతి
హామీలపై గళం విప్పినందుకా?
లోకేష్ యువగళం పాదయాత్రలో విద్యా రంగానికి సంబంధించి ఇచ్చిన హామీలు అమలుకు విద్యార్థి సంఘాలు నిలదీశాయి. ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో మౌలిక సదుపాయాలు, హాస్టల్స్‌లో వస తులపై గళం విప్పాయి. ప్రైవేటు కళాశాల లు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ రూ.లక్షల్లో ఫీజులు వసూలుపై విద్యార్థి సంఘాలు ప్రశ్నించాయి. దీంతో ఆంక్షలు పెట్టి విద్యార్థి సంఘాలకు కళ్లెం వేస్తున్నారు. –ప్రేమ్ కుమార్,
ఎస్వీయూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు
ప్రభుత్వం గీత దాటుతోంది
కూటమి ప్రభుత్వం తమ పరిధి దాటి ఆంక్షల పేరుతో కక్ష్య సాధింపు చర్యలకు దిగు తోంది. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే విద్యార్థి సంఘాలు ప్రయత్నిస్తాయి. అలాంటి ఆంక్షల పేరుతో విద్యాసంస్థలలోకి అనుమతులు లేకుండా జీఓలు జారీ చేయడం దుర్మార్గం. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తేలేదు. ఉద్యమ కార్యచరణతో పోరాటా లు చేసి తీరుతాం. –లోకేష్, పీడీఎస్‌యూ, జిల్లా కార్యదర్శి తిరుపతి
విద్యాహక్కును హరించడమే
విద్యార్థి సంఘాలపై ఆంక్షలు విధించి ప్రభుత్వం తప్పు చేసింది. స్వాతంత్య్ర ఫలాలను ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేయడం రాజ్యాంగ విరుద్ధం. విద్యార్థి సంఘాల అహర్నిశ కృషితోనే ఇప్పటికీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తమ విధులను నిర్వహిస్తున్నాయి. ఆంక్షలు విధిస్తే ఇక పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రశ్నించే గొంతు లేకపోతే ఆ వ్యవస్థలు నిర్వీర్యమైనట్టే. – చంద్రశేఖర్‌రావు, రిటైర్డ్ అధ్యాపకులు, తిరుపతి
ఇష్టారాజ్యంతో చెలరేగిపోతాయి
ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నాయి. ఇక నుంచి రూ.కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలపై స్పందించే వారు లేకపోతే అధికారులు, ప్రభుత్వాలు రెచ్చిపోయి తాము ఆడిందే ఆటగా వ్యవహరిస్తాయి. తస్మాత్ జాగ్రత్త. –సుబ్బలక్ష్మి, రిటైర్డ్ టీచర్, తిరుపతి

ఆగ్రహానికి గురికాక తప్పదు

ఆగ్రహానికి గురికాక తప్పదు

ఆగ్రహానికి గురికాక తప్పదు

ఆగ్రహానికి గురికాక తప్పదు

ఆగ్రహానికి గురికాక తప్పదు