
సీకాం డిగ్రీ కళాశాలకు ‘అటానమస్’
తిరుపతి సిటీ : అన్నమయ్య సర్కిల్‌లోని సీకాం డిగ్రీ కళాశాల మరో మైలురాయిని దాటింది. కళాశాలకు అటా నమస్ హోదా లభించిందని విద్యాసంస్థ చైర్మన్ డాక్టర్ టి.సురేంద్రనాథ్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఇటీవలే నాక్ బీ ప్లస్ ప్లస్ గ్రేడ్ సాధించామని, అటానమస్ కోసం దరఖాస్తు చేసుకోగా యూజీ సీ మా కళాశాలలో విద్యా నాణ్యతా ప్రమాణాలను, మౌలిక వసతులను పరిశీలించి హోదా కల్పించిందన్నారు. తిరుపతిలో అటానమస్ హోదా పొందిన తొలి డిగ్రీ కళాశాలగా గుర్తింపు పొందడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బందికి అధ్యక్షులు జయలక్ష్మి, డైరెక్టర్ ప్రణీత్ స్వరూప్, తేజ స్వరూప్ అభినందనలు తెలిపారు.
నా కొడుకు కర్కశంగా ప్రవర్తిస్తున్నాడు!
నాయుడుపేటటౌన్: కన్న తల్లి అన్న దయ, దాక్షిణ్యం చూపకుండా కొడుకు, కోడలు తనపై కర్కశంగా దాడి చేసి, ఇంటి నుంచి గెంటేయాలని చూస్తున్నారని తల్లి కలపాటి మేరమ్మ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు.. పట్టణం లోని లోతువానిగుంట కాలనీలో ఉన్న మేరమ్మ ఇంటి వద్ద బుధవా రం ఆమె కుమారుడు కలపాటి శ్రావణ్‌కుమార్, కోడలు లలిత కలిసి దాడి చేసినట్లు ఆవేదన చెందుతోంది. కుమారుడు, కోడలు తనను ఇంటి నుంచి గెంటి వేయాలని ఇద్దరు కలిసి దాడి చేయడంతో మేరమ్మ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెను స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. తన కష్టార్జితంతో కట్టుకున్న ఇంటిని ఇచ్చి వెళ్లి పోవాలంటూ కొడుకు, కోడలు కలిసి తరచు చిత్రహింసలు పెడుతున్నట్లు మేరమ్మ విలేకరుల ఎదుట వాపోయింది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
అగ్గిపెట్టె పరిమాణంలో అవార్డుల శకటం
గూడూరు రూరల్ : మండలంలోని విందూరు జెడ్పీ హైస్కూలు తెలుగు ఉపాధ్యాయుడు, సృజన చిత్రకారుడు కొండూరు వెంకటేశ్వరరాజు బుధవా రం అగ్గిపెట్టె పరిమాణంలో అవార్డుల శకటాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎస్‌ఓ గుర్తింపు పొందిన విద్య, సాహిత్య, సాంస్కృతిక సేవా సంస్థల నుంచి 200 అవార్డులు అందుకున్నానని, ఈ సందర్భంగా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు సృజనాత్మకంగా ఈ శకటాన్ని నమూనాగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.

సీకాం డిగ్రీ కళాశాలకు ‘అటానమస్’