
కేజీబీవీని సందర్శించిన సమగ్రశిక్ష ఏపీసీ గౌరీ శంకర్
తడ: జిల్లా సమగ్ర సర్వశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జీ గౌరీ శంకర్‌రావు ఇతర అధికారులతో కలిసి బుధవారం తడ కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల సిబ్బందితో సమావేశం నిర్వహించి, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, పదో తరగతిలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా చూడాలని కోరారు. పిల్లలకు చక్కటి భోజనం, పరిశుభ్రమైన వాతావరణంలో పెట్టాలని, శుభ్రమైన తాగునీటిని అందించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఓ భువనేశ్వరి, జీసీడీఓ పుష్పలత, ఎంఈఓ మల్లి కార్జునరావు, అభయ హస్తం పల్లవి పాల్గొన్నారు.
అన్యాయంగా జైల్లో పెట్టించారు!
చిట్టమూరు: కూటమి నేతలు తనని అన్యాయంగా రెండు నెలలు సెంట్రల్ జైల్లో పెట్టించారని చిట్టమూరు మండలంలోని గునపాటిపాళేనికి చెందిన చిప్పల లక్ష్మమ్మ వాపోయింది. గ్రామంలో బుధవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ –మోసం గ్యారంటీ కార్యక్రమానికి హాజరైన ఉమ్మడి నె ల్లూరు జిల్లా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ వద్ద లక్ష్మమ్మ తన గోడు వెళ్లబోసుకుంది. గ్రామంలో తండ్రి కొడుకులు, గొడవలు చేసుకుంటే వారికి సర్ధి చెప్పేందుకు వెళ్లిన తనపై కూటమి నేతలు నాన్ బెయిలబుల్ కేసు పెట్టించి, ఏ తప్పు చేయకపోయినా వైఎస్సార్ సీపీ సానుభూతి పరులమైన తమ ముగ్గురిని జైల్లో పెట్టించారని కన్నీటీ పర్యంతమైంది. వైఎస్సార్ సీపీ మండల నాయకు లు, గ్రామంలోని నాయకుల సహాయ సహకారాలతో తాము బెయిల్‌పై బయటకు వచ్చామని వారికి కృతజ్ఙతలు తెలియజేసింది.

కేజీబీవీని సందర్శించిన సమగ్రశిక్ష ఏపీసీ గౌరీ శంకర్