
అభిమానం.. అగ్రపథం
ఉమ్‌లింగ్‌లా రహదారి పక్కన ఎగురుతున్న
వైఎస్సార్‌సీపీ జెండా
వైఎస్సార్‌సీపీ మేమంతా సిద్ధం జెండాతో మనోజ్ రెడ్డి
జననేత జగనన్నపై అభిమానం ఉప్పొంగింది. పేదలకు అండ వైఎస్సార్‌సీపీ జెండాను అగ్రపథాన నిలిపింది. ప్రపంచంలోనే ఎత్తయిన జమ్ము పరిధిలోని ఉమ్‌లింగ్‌లా రహదారిపై పార్టీ పతాకాన్ని రెపరెపలాడించింది. వివరాలు.. నాయుడుపేటకు చెందిన వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా కార్యదర్శి భాస్కర్‌రెడ్డి తనయుడు మనోజ్‌రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన రెండు రోజుల కిందట జమ్మూ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో సముద్ర మట్టానికి 19,024 అడుగుల్లో నిర్మించిన ఉమ్‌లింగ్‌లా రహదారిపై ప్రయాణం సాగించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేసి పార్టీపై మమకారం చాటుకున్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమంటూ హర్షం వ్యక్తం చేశారు. – నాయుడుపేట టౌన్

అభిమానం.. అగ్రపథం