
పాఠశాల విలీనం ఆపాలని ఆందోళన
నారాయణవనం : మండలంలోని తుంబూరు దళితవాడ ప్రాథమిక పాఠశాల విలీనాన్ని విరమించుకోవాలని పిల్లలతో కలిసి తల్లిదండ్రులు, ఏఎస్‌ఎఫ్‌ఐ నేతలు గురువారం తహసీల్దార్, మండల విద్యాధికారి కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. ఊరి బడిలోనే పిల్లలు చదువుకునే వెసులుబాటును కల్పించాలని, పిల్లలను చదువుకు దూరం చేయొద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం డీటీ భాను ప్రకాష్, ఎంఈవో కార్యాలయ సిబ్బందికి వేర్వేరుగా వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఉదయ్ కుమార్, మహేష్, తల్లిదండ్రులు మాట్లాడుతూ.. విలీనం పేరుతో పాఠశాలలను మూసివేయడం, డీ గ్రేడ్ చేయడం దారుణమన్నారు. తుంబూరు డళితవాడ పాఠశాలలో చదు వుతున్న 56 మంది విద్యార్థులను పది మంది విద్యా ర్థులే ఉన్న పాఠశాలలో విలీనం చేయడం సరైన విధా నం కాదన్నారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు విద్యాసాగర్, ఇందుమతి, సారా,భాగ్యరాజ్, గోవిందయ్య, ప్రసాద్, మునివేలు, కుప్పలు, చంద్రయ్య, రవి, రాము, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.