
అక్రమ అరెస్టులతో భయపెట్టలేరు
తిరుపతి రూరల్ : వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని, అక్రమ అరెస్టులతో ఎవ్వరినీ భయపెట్టలేరని పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వెల్లడించారు. గురువారం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి చేరుకున్న ఆయన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మిని పరామర్శించి ధైర్యం చెప్పారు. లిక్కర్ స్కాం కేసులో నెల రోజులుగా చెవిరెడ్డిని జైలులో బంధించడాన్ని ఆయన తప్పుబట్టారు. చెవిరెడ్డి, మిథున్‌రెడ్డి వంటి వ్యక్తులను జగనన్నకు దూరం చేయాలని కుట్రలు పన్నుతూ తప్పుడు కేసుల్లో ఇరికిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
● మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి