
● ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ చూసి ఆశ్చ
2021లోనే చెత్త నుంచి సంపద
పొడి చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 2021లో అడుగులు వేసింది. ప్రతి కిలో పొడి చెత్త నుంచి రూ.2 ఆదాయాన్ని పొందుతున్న నగరంగా తిరుపతి దేశంలో తొలి సిటీగా నిలిచింది. నెలకు రూ.10 లక్షల మేర ఆదాయం లభిస్తోంది.
ఎరువుల తయారీ
నగరంలో ఉత్పత్తి అయ్యే వెట్ వెస్ట్ ద్వారా సేంద్రియ ఎరువుల తయారీకి 2020లో శ్రీకారం చుట్టారు. తడి చెత్త నిర్వహణను ఎన్జీఓ సంస్థకు అప్పగించారు. డీ కంపోజర్ చేసి తద్వారా ఎరువులు తయారు చేసి రైతులకు నామ మాత్రపు ధరలతో విక్రయించే విధానం తిరుపతి నుంచే మొదలైంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్వహణ ఆగిపోయింది.
తిరుపతి తుడా : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను గత ప్రభుత్వం అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నగరాల్లో ఉత్పత్తయ్యే చెత్తను వంద శాతం సద్వినియోగం చేసేందుకు చర్యలు చేపట్టింది. దీన్ని మహా యజ్ఞంగా భావించి రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ విధానాన్ని అమలుచేసింది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా చెత్త నిర్వహణను పక్కాగా అమలుచేసి దేశం తిరుపతి వైపు చూసేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ అమలుచేస్తున్న నగరాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణలో తిరుపతి అగ్రస్థానంగా నిలిచింది. అప్పటి అధికారులు చిత్తశుద్ధితో పీపీపీ పద్ధతిలో ప్లాంటును యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి అమల్లోకి తీసుకొచ్చారు. చెత్త ద్వారా సంపదను సృష్టించే విధానం తిరుపతి నుంచే మొదలైంది.
వ్యర్థ నీటి శుద్ధిలో రెండవ నగరం
తిరుపతి నగరంలో వెలువడే డ్రైనేజీ వ్యర్థాలను శుద్ధి చేసే కేంద్రం 1980లో ప్రారంభించారు. 50 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును స్వయంగా మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యర్థాలు సామర్థ్యానికి మించి వెలువడుతోంది. 2020లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా వాటర్ ప్లస్ విధానానికి శ్రీకారం చుట్టారు. స్మార్ట్ సిటీ నిధుల నుంచి రూ.32 కోట్లు వెచ్చించి 25 ఎమ్‌ఎల్డీ నీటి శుద్ధి కేంద్రాన్ని రెండేళ్ల పాటు శ్రమించి అభివృద్ధి చేశారు. ఆధునిక టెక్నాలజీతో మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ శుద్ధి చేసిన నీటిని ప్రైవేటు కంపెనీలకు విక్రయించడంతో పాటు చుట్టు పక్కల రైతులకు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఇలా చెత్తను 100 శాతం రిలీజ్ చేసేందుకు నాటి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేసింది.
సిమెంటు ఇటుకల తయారీ
తూకివాకం గ్రీన్‌సిటీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులు
2019లో బయో మెథనైజేషన్ ప్లాంటును మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీతో తిరుపతి నగర పాలక సంస్థ ఎంఓయూ (ఒప్పందం) కుదుర్చుకుంది. తిరుపతి నగరంలో ఉత్పత్తి అయ్యే తడి చెత్త, ఫుడ్ వేస్ట్ ద్వారా గ్యాస్‌ను ఉత్పత్తి చేసి విక్రయించుకునేందుకు అనుమతించారు. మున్సిపల్ కార్పొరేషన్ తూకివాకంలో రెండెకరాల స్థలాన్ని మాత్రమే ఆ కంపెనీకి అప్పగించింది. రూ.18 కోట్లు వెచ్చించి బయో మెథనైజేషన్ ప్లాంటును అభివృద్ధి చేసి నగరంలో ఉత్పత్తయ్యే తడి చెత్తను పూర్తిస్థాయిలో ఎరువులుగా తయారుచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్లాంట్‌ను బ్లూ ప్లానెట్ సంస్థ నిర్వహిస్తోంది.
ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ఆరా
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉత్పత్తయ్యే చెత్తను రెడ్యూస్, రీయూస్ రీసైక్లింగ్ చేస్తున్న విధానంపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు కట్టారు? ఎంత ఖర్చు చేశారు? అని ఆరా తీశారు. ఈ ప్రాజెక్టులను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధిచేశారని చెప్పడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత అభివృద్ధి గురించి తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని వాకబు చేశారు. ప్లాంట్ల నిర్వహణ బాగుందని ప్రశంసించారు. బయో మెథనైజేషన్ ప్లాంటుకు చంద్రబాబు 2018లో ఎంఓయూ కుదుర్చుకుని ఆపై విస్మరించారు. తిరిగి 2019లో మహేంద్ర కంపెనీతో ఒప్పందం కుదిరి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయించేందుకు నాటి పాలకులు, అధికారులు ఎంతో శ్రమించారు. మిగిలిన ప్రాజెక్టులను 2019–24 మధ్య ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిపై ఆరా తీసి వ్యర్థాల నిర్వహణపై సీఎం సంతృప్తి వ్యక్తంచేసి అధికారులను అభినందించారు.
సీ అండ్ డీ (కన్‌స్ట్రక్షన్ అండ్ డెమోలిష్) ప్రాజెక్టును పీపీపీ పద్ధతి ద్వారా ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. 2020లో రూ.14 కోట్లు ఖర్చుచేసి భవన వ్యర్థాల ద్వారా సిగ్రిగేషన్ ప్రక్రియను ప్రారంభించారు. భవన వ్యర్థాల్లోని ఇసుక, కంకర, ఐరన్‌ను వేరు చేయడం, తద్వారా వెలువడిన ఇసుక సన్నని కంకర ద్వారా ఫుట్ పాత్‌కు ఉపయోగించే సిమెంట్ ఇటుకల తయారీ రోడ్ల నిర్మాణంలో ఉపయోగించుకునేందుకు అవసరమైన మెటీరియల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. నగరంలో వెలువడే భవన వ్యర్థాలను 100 శాతం సిగ్రిగేషన్(విభజన) చేయాలనే సంకల్పంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.