
మేమూ రైతులమే
మా కష్టాలు మాకు తెలుసు. మా కష్టాలు ఎవరికో ఒకరికి చెప్పుకుంటే తప్ప తీరదు. అలాంటప్పుడు ప్రభుత్వం ముందుకు రావాలి. రైతులను ఆదుకోవాలి. మా కష్టసుఖాలను వినాలి. అలా ఎవరు వచ్చినా కష్టాలను చెప్పుకోవడానికి రైతులు ముందు పడతాం. వస్తే అందుకు ఈ రకంగా చేస్తారా..? దారుణమండి. ఇలా చేయడం కరెక్టు కాదు. పోలీసులు మారాలి. కక్షపూరితమైన రాజకీయాలు వద్దు. మనుషులని చూడండి. రైతు కష్టాలను అన్ని శాఖల అధికారులకంటే.. పోలీసులే దగ్గరుండి చూశారు. మీలో కూడా రైతు కుటుంబాలు ఉన్నాయి..కదా. టోకన్ల కోసం ఎంత ఇబ్బంది పడ్డారో చూశారు కదా.. మళ్లెందుకు ఇలా చేశారు.
– పెద్దిరెడ్డి, రైతు, వేపంజేరి