
విద్యార్థుల ఆస్తకిని ప్రోత్సహించాలి
వెంకటగిరి రూరల్: విద్యార్థులు ఆసక్తి చూపే రంగాల్లో తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. వెంకటగిరి పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్‌లో గురువారం ప్రిన్సిపల్ తులసి జ్యోతి ఆధ్వర్యంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలసి కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కలెక్టర్ వెంకటేశ్వర్‌తో పాటు జిల్లా అఽధికారులు టగ్ ఆఫ్ వార్ పోటీల్లో పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో తల్లిదండ్రులు భాగస్వామ్యులు కావాలన్నారు. ఐసర్‌లో కేవలం 3 శాతం మంది మాత్రమే తెలుగువారు ఉన్నారని తెలిపారు. ఈ సంఖ్యను మరింత పెంచే దిశగా తల్లిదండ్రులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులతో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే రామకృష్ణ ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈఓ కేవీఎన్ కుమార్, సర్వశిక్ష అభియాన్ సీఎంఓ సురేష్, ఏపీసీ గౌరిశంకర్, ఎంపీపీ తనుజారెడ్డి, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధర్, ఎంఈఓ బాబయ్య, పాఠశాల ప్రిన్సిపల్ తులసిజ్యోతి, తహశీల్దార్ వెంకట నరసింహారావు, ఎంపీడీఓ గుణశేఖర్‌రెడ్డి, విద్యాకమిటీ చైర్మన్ గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.