
ప్రభుత్వ కార్యాలయమా.. పార్టీ భవనమా!
నాగలాపురం: ప్రభుత్వ కార్యాలయాన్ని.. పార్టీ ఆఫీసుగా మార్చేశారు స్థానిక తెలుగు తమ్ముళ్లు.. నాగలాపురం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి పసుపు రంగు పులిమేశారు. ప్రభుత్వ కార్యాలయానికి టీడీపీ రంగు వేయడంపై ఇది పభ్రుత్వ కార్యాలయమా? పార్టీ ఆఫీసా అని విమర్శలు గుప్పిస్తున్నారు. రంగులు మార్చడానికి చేసే ఖర్చుతో అభివృద్ధి పనులు చేస్తే బాగుండేదని ప్రజలు హితవు పలుకుతున్నారు.
అధిక రక్తపోటుపై అవగాహన
తిరుపతి తుడా : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బాలకృష్ణనాయక్ ర్యాలీ ప్రారంభించి ప్రసంగిస్తూ ఏటా సుమా రు 10 లక్షల మరణాలకు అధిక రక్తపోటు కారణం అవుతోందన్నారు. ప్రధానంగా జీవన శైలి గాడి తప్పడమే దీనికి ప్రధాన కారణమన్నారు. శారీరక వ్యాయామం, మంచి పోషకాహారం తీసుకోవడం, ఆహారంలో కారం, ఉప్పు తగ్గించి తీసుకోవడం చేయాలని సూచించారు. అధిక రక్తపోటుపై అవగాహన పెంచేందుకు వైద్య నిపుణలతో సదస్సులు నిర్వహించడం ద్వారా నియంత్రించ వచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీనివాసుల రెడ్డి, డిప్యూటి డీఎమ్‌హెచ్‌ఓ డాక్టర్ మురళి కృష్ణ, డిఐఓ ఇంచార్జ్ డాక్టర్ ఛత్ర ప్రకాష్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రెడ్డి ప్రసాద్, డాక్టర్ రూప్ కుమార్, కిరణ్ కుమార్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ కార్యాలయమా.. పార్టీ భవనమా!