
డిగ్రీ పరీక్ష కేంద్రాల తనిఖీ
తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలో డిగ్రీ 2, 4వ సెమిస్టర్‌కు సంబంధించి పరీక్ష కేంద్రాలను సోమవారం వీసీ సీహెచ్ అప్పారావు ఆకస్మిక తనిఖీ చేశారు.వేసవి నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కళాశాల యాజమాన్యాలను ఆదేశించారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే సదరు విద్యార్థితో పాటు కళాశాలలపైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కండలేరు జలాలు విడుదల
రాపూరు:కండలేరు జలాశయం నుంచి సోమవా రం చైన్నెకు నీటిని విడుదల చేశారు. తెలుగుగంగ ఎస్‌ఈ రాధాకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఈ మేరకు గంగమ్మకు పూజలు నిర్వహించి నీరు వదిలిపెట్టారు. ఎస్‌ఈ మాట్లాడుతూ చైన్నె వాసుల దాహార్తిని తీర్చడంతోపాటు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు , తిరుపతి జిల్లాల రైతులకు తాగు, సాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల కండలేరు జలాలను విడుదల చేశామన్నారు. ఏటా చైన్నె నగరానికి 5 టీఎంసీలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కండేలరులో 45 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వివరించారు. విడుదల చేసిన నీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఈఈలు విజయకుమార్‌రెడ్డి, రాధాకృష్ణమూర్తి, రామచంద్రమూర్తి, డీఈఈ రేవతి, ఏఈలు తిరుమలయ్య, అనిల్‌బాబు పాల్గొన్నారు.

డిగ్రీ పరీక్ష కేంద్రాల తనిఖీ