
నృసింహుని హుండీ లెక్కింపు
రాపూరు : పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపును సోమవారం చేపట్టినట్లు ఏసీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. 38 రోజులకు గాను శ్రీవారికి హుండీ ద్వారా కానుకల రూపంలో రూ.45,88,223 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. అలాగే 89 గ్రాముల బంగారం, 2.1 కేజీల వెండి వచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో ఈఓ కవిత తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి..సంక్షేమానికి ప్రాధాన్యం
తిరుపతి అర్బన్ : జిల్లాలో అభివృద్ధి పనులు, సంక్షేమా పథకాల అమలుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షీ, డీఆర్‌ఓ నరసింహులతో కలసి అధికారులతో సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జోనల్ ఇన్‌చార్జి అధికారి ఎంటీ కృష్ణబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఉందని వెల్లడించారు. అన్నిశాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్‌మాండ్, ముఖ్య ప్రణాళికాధికారి వెంకటేశ్వర్లు, డీపీఓ సుశీలాదేవి, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, సాంఘిక సంక్షేమశాఖ జిల్లా అధికారి విక్రమకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

నృసింహుని హుండీ లెక్కింపు