
కంగ్రాట్స్ రామ్
● వెంకటగిరి మున్సిపాలిటీ విజయంపై నేదురుమల్లికి జగన్ అభినందన
వెంకటగిరి(సైదాపురం): ‘కంగ్రాట్స్ రామ్.. వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో నీ పాత్ర కీలకం’ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మెచ్చుకున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి కలిశారు. బుధవారం వెంకటగిరిలో జరిగిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన విశేషాలను జగన్‌కు వివరించారు. టీడీపీ కుట్రలను ఎదుర్కొని అవిశ్వాస తీర్మానంలో నెగ్గడం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని ఆయన కొనియాడారు. త్వరలోనే మున్సిపల్ చైర్మన్‌తోపాటు 18 మంది కౌన్సిలర్లతో ప్రత్యేక అభినంద సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వెంటగిరి మున్సిపల్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానంలో నెగ్గి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతికిగా అందించినట్లు పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారానికి సలహాలివ్వండి
తిరుపతి అర్బన్: జిల్లాలో రెవెన్యూ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సీసీఎల్ ఆదేశాల మేరకు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు, గూడూరు ఆర్డీవో రాఘవేంద్ర మీనా ఆధ్వర్యంలో వర్క్‌షాపు నిర్వహించారు. జిల్లాలో పది నెలల కాలంలో 37వేల అర్జీలు వచ్చాయి. అందులో 25వేల అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు నిపుణుల నుంచి సలహాలు స్వీకరించనున్నట్టు తెలిపారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్‌మాండ్, సుధారాణి, తిరుపతి ఆర్డీవో రామమోహన్, శ్రీకాళహస్తి ఆర్డీవో పాల్గొన్నారు.

కంగ్రాట్స్ రామ్